Saturday, April 20, 2024
- Advertisement -

చిత్రపరిశ్రమలో ఎన్నికల వేడి?

- Advertisement -

మా ( మూవీ ఆర్టిస్ట్స్​ అసోసియేషన్​) ఎన్నికల వేడి అప్పుడే మొదలయ్యింది. ఈ సారి ఎన్నికల్లో మంచు కుటుంబం పోటీచేయబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. మరోవైపు ప్రకాశ్​రాజ్​ సైతం ఈ ఎన్నికల్లో పోటీచేస్తున్నారు. దీంతో ఎవరికి వారు మద్దతు కూడగట్టుకొనేందుకు అప్పుడే ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఇటీవల కలెక్షన్​కింగ్​, మంచు మోహన్​బాబు, ఆయన కుమారుడు విష్ణు.. సూపర్​ స్టార్​ కృష్ణను కలుసుకున్నారు. మా ఎన్నికల నేపథ్యంలో వీరి భేటీ ప్రాధాన్యం సంతరించుకున్నది. మరోవైపు ప్రకాశ్​ రాజ్​ సైతం మద్దతు కూడ గట్టుకొనేందుకు యత్నిస్తున్నారు. ఆయనకు మెగాస్టార్​ చిరంజీవి మద్దతు ఇస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి.

గతంలో ఓ సారి ప్రకాశ్​రాజ్​.. జనసేన అధినేత పవన్​కల్యాణ్​పై విమర్శలు గుప్పించారు. ఈ క్రమంలో ఆయనకు ప్రస్తుతం చిరంజీవి మద్దతు ఇస్తున్నట్టు వార్తలు రావడం గమనార్హం. మా ఎన్నికలు అంటేనే రసవత్తరంగా సాగుతూ ఉంటాయి. ప్రస్తుతం ప్రకాశ్​రాజ్​కు మెగా ఫ్యామిలీ మద్దతు ఇస్తుండగా.. ఇటు మంచు కుటుంబానికి నరేశ్​ అండగా నిలబడుతున్నట్టు సమాచారం. ప్రస్తుత అధ్యక్షుడిగా ఉన్న నరేశ్​ .. లాక్​డౌన్​ సమయంలో ఎంతోమందిని ఆదుకున్నారు. చిన్న నటులు, సినీ ఇండస్ట్రీ కి చెందిన వారితో ఆయనకు సత్సంబంధాలు ఉన్నాయి.

అయితే గతంలో మెగా కుటుంబం నరేశ్​కు మద్దతు ఇచ్చింది. కానీ ఈ సారి మాత్రం ప్రకాశ్​ రాజ్​కు సపోర్ట్ చేస్తున్నట్లు టాక్. అయితే ప్రకాశ్​రాజ్​ పరభాషా నటుడు అయినప్పటికీ ఆయనకు మెగా ఫ్యామిలీ అండగా ఉంది కాబట్టి.. సీన్​ మరోలా ఉంటుందని అంటున్నారు. ప్రకాశ్​ రాజ్​ను అంతా మెగా మద్దతుదారుడిగా మాత్రమే చూస్తారని కూడా టాక్​ నడుస్తోంది. ఏది ఏమైనా ప్రస్తుతం మా ఎన్నికలతో హీట్​ పెరిగింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -