Tuesday, April 30, 2024
- Advertisement -

ఓటర్ వివాదం ముగిసినట్టేనా?

- Advertisement -

కొన్ని కొన్ని సార్లు సినిమాలు అనుకున్న విడుదల తేదీ కి రావు. చాలా సార్లు అలా లేట్ అవుతూ ఎప్పటికో కానీ విడుదల కి నోచుకోవు. అయితే ఇప్పుడు మంచు విష్ణు నటించిన సినిమా ఓటర్ ఫైనల్ గా విడుదల ముహుర్తాన్ని ఖరారు చేసుకుంది. ఎప్పుడో ఎన్నికల ప్రకటన ముందు రావాల్సిన ఈ సినిమా ఎన్నికలు పూర్తి అయి ఫలితాలు వచ్చిన వారం తర్వాత కూడా విడుదల అవ్వట్లేదు. చిట్ట చివరగా ఈ సినిమా వచ్చే నెలలో విడుదల చేస్తాం అని చిత్ర యూనిట్ ప్రకటించింది.

యూ/ఏ తో ఈ సినిమా సెన్సార్ పనులని కూడా ముగించుకుంది. పొలిటికల్ డ్రామా గా తెరకెక్కిన ఈ చిత్రం లో చిత్ర యూనిట్ కొన్ని వివాదాస్పద అంశాలని టచ్ చేశారు అని తెలుస్తుంది. అయితే సెన్సార్ సభ్యులు క్షుణ్ణం గా పరిశీలించాక మాత్రమే ఈ సినిమా ని క్లియర్ చేశారు. ఇప్పటికే విడుదల అయినా టీజర్ ఓ మాదిరి గా అందరినీ ఇంప్రెస్ చేసినా సినిమా లో స్టఫ్ ఉంటేనే విజయవంతం అవుతుంది అని చెప్పడం లో ఏ మాత్రం అతిశయోక్తి లేదు.

ఇక పోతే దర్శకుడి తో వివాదానికి దిగిన విష్ణు ఇప్పుడు సినిమా ని విడుదల చేస్తున్నాడు అంటే,సినిమా వివాదం ముగిసినట్టే అనుకోవాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -