Tuesday, May 7, 2024
- Advertisement -

విజ‌య‌వాడ బ‌య‌ల్దేరిన స్టీఫెన్ ర‌వీంద్ర‌..కాసేప‌ట్లో తాడేప‌ల్లిలో జ‌గ‌న్‌తో భేటీ

- Advertisement -

ఆంధ్రప్రదేశ్ కొత్త ఇంటెలిజెన్స్ చీఫ్‌గా స్టీఫెన్ రవీంద్ర రానున్నార‌నె వార్త‌ల‌కు బ‌లం చేకూరింది. జ‌గ‌న్ సీఎంగా ప్ర‌మాణ‌స్వీకారం చేసిన వెంట‌నె అన్ని వ్య‌వ‌స్థ‌ల‌ను రాజ‌కీయ ప్ర‌క్షాల‌న చేయాల‌ని భావిస్తున్నారు. దీనిలో భాగంగా కొత్త టీమ్‌ను రెడీ చేసుకుంటున్నారు. టీడీపీ ప్ర‌భుత్వ హ‌యాంలో పోలీసుల వ్య‌వ‌స్థ‌పై వ‌చ్చిన‌న్ని ఆరోప‌న‌లు లేవు. వాట‌న్నింటికి చెక్ పెట్టేందుకు జ‌గ‌న్ నిర్ణ‌యం తీసుకున్నారు.

దీనిలో భాగంగానె ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఇంటిజెన్స్ చీఫ్‌గా స్టీఫెన్ ర‌వీంద్ర రానున్నారె వార్త‌లు హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి. గతంలో వైఎస్ హయాంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డికి ఛీప్ సెక్యూరిటీ ఆఫీసర్‌గా స్టీఫెన్ రవీంద్ర పనిచేశారు. రాయలసీమలో కూడా ఆయన బాధ్యతలు నిర్వర్తించారు. ఇటీవల తెలంగాణలో చోటు చేసుకున్న ఐటీ గ్రిడ్ చోరీకి సంబంధించి ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ ఇంఛార్జ్‌కు కూడా స్టీఫెన్ రవీంద్ర వ్యవహరించారు.

ఆ వార్త‌ల‌ను నిజం చేస్తూ ఐపీఎస్‌ అధికారి స్టీఫెన్‌ రవీంద్ర విజయవాడకు బయల్దేరారు. మరికాసేపట్లో తాడేపల్లిలో వైఎస్‌ జగన్‌ను స్టీఫెన్‌ రవీంద్ర కలవనున్నారు. ఏపీ ఇంటెలిజెన్స్‌ చీఫ్‌గా స్టీఫెన్‌ రవీంద్ర నియామకం అవుతారని వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జగన్‌తో రవీంద్ర భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.

1999 బ్యాచ్‌ ఐపీఎస్‌ అధికారి స్టీఫెన్‌ రవీంద్ర.. ప్రస్తుతం తెలంగాణ కేడర్‌లో హైదరాబాద్‌ రేంజ్‌ ఐజీగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఐటీ గ్రిడ్‌ డేటా చోరీపై తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్‌కు చీఫ్‌గా ఉన్నారు. వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి హయాంలో అనంతపూర్‌ జిల్లా ఎస్పీగా బాధ్యతలు స్వీకరించగానే ఫ్యాక్షన్‌పై ఉక్కుపాదం మోపారు స్టీఫెన్‌ రవీంద్ర. అందుకే ఆయ‌న్ను జ‌గ‌న్ త‌న టీమ్‌లోకి తీసుకున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -