Tuesday, May 6, 2025
- Advertisement -

శృంగారసన్నివేశాల చిత్రీకరణలో ఆయన ఫామ్ లోకొచ్చాడు!

- Advertisement -

మణిరత్నం.. దశాబ్దాల క్రితమే భారతీయ చిత్ర పరిశ్రమలో ఎగసిన తరంగం. వైవిధ్యమైన కథాంశాలకు..

భిన్నమైన కథనాలతో మణి భారతీయ చిత్ర మేధావిగా ఎదిగాడు. ప్రపంచి సినీ మేధావుల దృష్టిలో పడ్డారు. పల్లవి అనుపల్లవి లాంటి తొలి సినిమా ప్లాఫ్ అయినా.. తర్వాతి సినిమాలతో మణి ప్రభ ప్రవర్ధమానమైంది.

 

నాయకుడు, ఘర్షణ వంటి సినిమాలు మణిరత్నం స్థాయికి రుజువులుగా నిలిచాయి. కేవలం సీరియస్ సినిమాలే కాకుండా రొమాంటిక్ టచ్ విషయంలో కూడా మణి తన ప్రత్యేకతను నిరూపించుకొన్నాడు. మౌనరాగం సినిమాలో రేవతి- కార్తిక్ జంట మధ్య నడిచే రొమాన్స్ ఏ హృదయాన్ని అయినా కదిలిస్తుంది. ప్రేమంటే ఇలా ఉంటుందా.. ప్రేమిస్తే ఇలాంటి అనుభవాలుంటాయా.. అనే ఉద్వేగాలను కదిలిస్తుంది మౌనరాగం సినిమా.

ఇక రోజా వంటి సినిమా అయితే ఒక రొమాంటిక్ ఎపిక్ గా నిలిచింది. కాశ్మీర్ లోని పరిస్థితుల గురించి గొప్ప చర్చలా నడిచే ఈ సినిమా భార్యభర్తల అనుబంధాన్ని గొప్పగా హైలెట్ చేసింది. విశేషం ఏమిటంటే.. చాలా సంవత్సరాలుగా మణిరత్నం సినిమాలను గమనిస్తే.. వాటన్నింటిలోనూ శోభనం రాత్రి సన్నివేశాలు కచ్చితంగా ఉంటాయి. ఒకటని కాదు.. కడల్ వంటి సినిమాలను మినహాయిస్తే.. మణి సినిమాల్లో తొలిరాత్రి సన్నివేశాలు తప్పనిసరి.. కచ్చితంగా ఉండాలంతే!

మరి మణి తాజా సినిమా’ ‘ఓకే బంగారం’ లో కూడా ఆ తీరు కొనసాగింది. ఇందులో కూడా హీరోహీరోయిన్లు దుల్కర్ , నిత్యాల మధ్య ఫుల్ రొమాన్స్ ఉంటుంది. సినిమా చూసే వారిలో అలజడిని పుట్టిస్తుంది. దీంతో ఈ దర్శకుడు రొమాన్స్ ను చిత్రీకరించడంలో మళ్లీ ఫామ్ లోకి వచ్చాడని చెప్పవచ్చు!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -