Friday, May 3, 2024
- Advertisement -

‘మన్మధుడు 2’ కాపీ కాదు అంటున్న నాగార్జున

- Advertisement -

నాగార్జున హీరోగా యువ దర్శకుడు రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో ‘మన్మధుడు 2’ సినిమాతో త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ కథ గురించి ఇప్పటికే బోలెడు పుకార్లు బయటకు వచ్చాయి. తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ నాగార్జున ఈ విషయమై క్లారిటీ ఇచ్చారు. ఇది ఒక కాపీ సినిమా అని కొందరు కామెంట్ చేస్తున్నారు. ఊపిరి సినిమా ఫ్రెంచ్ సినిమా రీమేక్ అని, అయితే డబ్బులు ఇచ్చి సినిమా రైట్స్ కొనుక్కొని రీమేక్ చేశాం అని ‘మన్మధుడు 2’ విషయంలో కూడా అలానే చేశాం అని నాగ్ వెల్లడించారు.

“ఏడాదిన్నర క్రితం ఈ స్క్రిప్ట్ నాకు వచ్చింది. ఇది ఒక ఫ్రెంచ్ సినిమా రీమేక్. స్క్రిప్ట్ బాగా నచ్చడంతో వెంటనే ఓకే చెప్పాను. కానీ కథ మీద చర్చలు అప్పుడే ప్రారంభించలేదు. రెండు నెలలు ఆగి రాహుల్ ఈ సినిమా రీమేక్ రైట్స్ తీసుకున్నట్లు గా పేపర్లు చూపించిన తరువాత ఈ సినిమాని ఓకే చేశాను. కథను మాత్రమే తీసుకొని సినిమా మాత్రం తెలుగు ప్రేక్షకులకు నచ్చే విధంగా మార్చాం” అని చెప్పుకొచ్చాడు నాగార్జున. అంతే కాక ‘మన్మధుడు’ మరియు ‘మన్మధుడు 2’ సినిమాలకి ఎలాంటి సంబంధం లేదని, కానీ ఈ సినిమాకి ‘మన్మధుడు 2’ అని టైటిల్ పెట్టడానికి బలమైన కారణం ఉందని అది సినిమా చూశాకే అర్థమవుతుందని అంటున్నారు నాగార్జున. రకుల్ ప్రీత్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా ఆగస్టు 9న విడుదల కాబోతోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -