Thursday, May 2, 2024
- Advertisement -

కర్ణాటక సంక్షోభం వెనుకున్నది ఇతడేనట..

- Advertisement -

కర్ణాటకలో సర్కారు కుప్పకూలింది. బీజేపీ పట్టుబట్టి మరీ ప్రభుత్వాన్ని కూల్చి ఇప్పుడు కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేయబోతుందని అంతా ఆశించారు. కానీ కన్నడలో కూల్చింది బీజేపీ కాదని.. కాంగ్రెస్ మాజీ సీఎం సిద్ధరామయ్య అని తాజాగా తేలింది. ఇప్పుడు ఈ విషయం తీవ్ర దుమారం రేపుతోంది.

కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ సీఎం సిద్ధరామయ్య సంకీర్ణ ప్రభుత్వం నుంచి కుమారస్వామిని దించి తను సీఎం అవ్వాలని వేసిన ప్లాన్ బెడిసికొట్టింది. కుమారస్వామి దిగిపోయాడు కానీ బలం లేక కాంగ్రెస్ సంకీర్ణం నిలబడలేకపోయింది. ఇక సిద్ధరామయ్య సీఎం అవుదామన్న ఆశలపై బీజేపీ నీళ్లు చల్లినట్టైంది. బీజేపీ కర్ణాటకలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తోంది.

కొద్దిరోజుల క్రితం కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వం నుంచి అసమ్మతితో 16మంది ఎమ్మెల్యేలు బయటకు వచ్చి రాజీనామా చేశారు. ఈ కాంగ్రెస్ ఎమ్మెల్యేల వెనుక ఉన్నది సిద్ధరామయ్యే అని తాజాగా అసమ్మతి ఎమ్మెల్యే శివరామ్ హెబ్బార్ బాంబు పేల్చాడు. మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన సిద్ధరామయ్య అసమ్మతి ఎమ్మెల్యేలను దూరంగా ఉండమని చెప్పారని.. అందుకే ప్రభుత్వం కూలిపోయేలా మేం కలిసి నిర్ణయం తీసుకున్నామని సంచలన ప్రకటన చేశారు.

కాగా ఈ వ్యాఖ్యలు కాంగ్రెస్-జేడీఎస్ లో కలకలం రేపాయి. తన ప్రతిష్టకు భంగం కలిగేలా కొందరు వ్యవహరిస్తున్నారు. ఇంకోసారి ఇలాంటి ఆరోపణలు చేస్తే వారికి గట్టిగా బుద్ది చెబుతానని సిద్ధరామయ్య కౌంటర్ ఇచ్చారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -