Friday, May 3, 2024
- Advertisement -

బిగ్ బాస్ హౌస్ లో నాగార్జున హీరోయిన్

- Advertisement -

టాలీవుడ్ కింగ్ నాగార్జున హీరోగా ‘చిలసౌ’ ఫేమ్ రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో ‘మన్మధుడు 2’ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. రకుల్ ప్రీత్ సింగ్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. ఈ మధ్యనే విడుదలైన ఈ చిత్ర టీజర్ మరియు ట్రైలర్ మంచి రెస్పాన్స్ అందుకున్నాయి. ‘మన్మధుడు’ సినిమా సూపర్ హిట్ అయింది కాబట్టి ఆ సినిమాకి సీక్వెల్ అయిన ‘మన్మధుడు 2’ కూడా బ్లాక్ బస్టర్ అవుతుందని అభిమానులు కూడా ఆశిస్తున్నారు. ఆగస్టు 9న ఈ సినిమా విడుదల కాబోతుంది. తాజాగా చిత్ర బృందం ప్రమోషన్ల హడావుడి మొదలు పెట్టింది. ఈ నేపద్యంలో బిగ్ బాస్ హౌస్ లో కూడా మన్మధుడు ప్రమోషన్స్ జరగబోతున్నట్లు వినికిడి.

నాగార్జున బిగ్బాస్ సీజన్ 3 కి హోస్ట్ గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ లోకి చిత్ర ప్రమోషన్స్ కోసం దర్శకుడు రాహుల్ రవీంద్రన్ మరియు హీరోయిన్ రకుల్ ప్రీత్ వెళ్లబోతున్నారని తెలుస్తోంది. కానీ నాగార్జున మాత్రం బిగ్ బాస్ హౌస్ లోకి అప్పుడే వెళ్లరట. గతేడాది నాని బిగ్ బాస్ సీజన్ 2 హోస్ట్ గా వ్యవహరిస్తున్న సమయంలో బిగ్ బాస్ ప్రమోషన్ల కోసం నాగార్జున హాజరయ్యారు. హౌస్ లో కి వెళ్లకపోయినా నాని పక్కనే ఉండి తన సినిమాని ప్రమోట్ చేశారు నాగ్. ఇప్పుడు నాగార్జున హోస్ట్ గా మారి తన సినిమాని ప్రమోట్ చేస్తున్నారు అన్నమాట.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -