Saturday, April 20, 2024
- Advertisement -

వెంకటేష్ కి నాలుగు టైటిల్స్ ?

- Advertisement -

కొన్నాళ్ళు సావాసం చేస్తే వారు వీరవుతారు అంటారు. అలాగే గోపాలా గోపాలా సినిమా షూటింగ్ లో పవన్ కళ్యాణ్ తో నటిస్తున్నప్పుడు వెంకటేష్ కి ఏం పాకిందో కానీ ఆ సినిమా తరవాత ఎప్పుడూ సినిమాలు ఎక్కువగా చేస్తూ బిజీ గా ఉండే వెంకటేష్ సైలెంట్ అయిపోయాడు.

సినిమాకీ సినిమాకీ బాగా గ్యాప్ పెంచుకుని ఇండస్ట్రీ లో జనాలని ఆశ్చర్యపరుస్తున్నాడు వెంకీ. తన కొత్త సినిమా భలే భలే మగాడివోయ్ ని ప్రస్తుతం మారూతి చేతిలో పెట్టిన వెంకటేష్ ఆ సినిమా కథ బాగా నచ్చి సంతకం పెట్టిన విషయం తెలిసిందే. వెంకీ ఓ కామెడీ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్న ఈ సినిమాలో వెంకటేష్ సరసన అందాల భామ నయనతార జోడీ కట్టనుంది.

ఈ సినిమా కి మారుతి నాలుగు డిఫరెంట్ టైటిల్స్ ని ప్రొపోజ్ చేస్తున్నాడు. ఆ నాలుగు టైటిల్ ఇవే.. ‘బాబు బంగారం’, ‘డిమాండ్ రాజ’, ‘రాజా రత్నం’, ’24 కారెట్ బంగారం’ ఈ నాల్గింట ఏ టైటిల్ ని ఓకే చేస్తారు అనేది ఇంకా తెలియాల్సి ఉంది.

ఈ సినిమా విషయం లో వెంకటేష్ చాలా పాజిటివ్ గా ఉన్నాడు అని దానికి కారణం స్క్రిప్ట్ అని అంటున్నారు. వీటిల్లో ఏది బాగుందో మీరే కామెంట్స్ లో చెప్పి కాస్త పుణ్యం కట్టుకోండి. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -