ఏళ్ల నుంచి సరైన హిట్ లేక మదనపడిపోతున్న మాస్ మహారాజకు రాజా ది గ్రేట్ మంచి హిట్ ఇచ్చింది. ఆ విజయానందంలో రవితేజ మునిగిపోయాడు. తన తమ్ముడి కేసులు, మరణంతో బాధపడుతున్న అతడికి ఈ సినిమా విజయంతో కొంచెం ఉపశమనం పొందే అవకాశం ఉంది. ఆ బాధలు మరచిపోయేలా చేశాయి. ఆ సినిమా హిట్‌తో తన తదుపరి సినిమాలు శరవేగంగా పూర్తిచేస్తున్నాడు. ప్రస్తుతం విక్రమ్ సిరికొండ దర్శకత్వంలో టచ్ చేసి చూడు చిత్రం చేస్తున్నాడు.
ఈ సినిమాలో పోలీస్ లుక్‌లో కనిపించబోతున్నాడు. సినిమా చిత్రీకరణ శరవేగంగా కొనసాగుతోంది. షూటింగ్‌లో పాల్గొన్న ఓ ఫొటో సోషల్ మీడియాలో కనిపించింది. అధికారికంగా రిలీజ్ చేసినది కాపకపోయినా లీక్ అయినా ఫొటోకు సూపర్ రెస్పాన్స్ వస్తోంది. పోలీస్ పాత్రల్లో విక్రమార్కుడు, పవర్ సినిమాలో తనలోని కొత్త నటుడిని బయటకు తెచ్చిన రవితేజ ఈ సినిమాలో కూడా అలాగే హుషారుగా నటిస్తున్నాడు. ఆ ఫొటోలో పోలీస్ ఆఫీసర్ గెటప్‌లో కళ్లజోడు పెట్టుకున్న రవితేజ లుక్ అదిరిపోయింది. అయితే ఈ సినిమాకు సంబంధించిన వివరాలు, టీజర్లు, ట్రైలర్స్ వంటివేమీ బయటకు రాలేదు. రాశీఖన్నా, లావణ్య త్రిపాఠి హీరోయిన్లుగా నటిస్తున్నారు.
లక్ష్మీ నరసింహ ప్రొడక్షన్స్ పతాకంపై నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి), వల్లభనేని వంశీమోహన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. బేబీ భవ్య సమర్పణలో రాబోతోంది. వక్కంతం వంశీ కథ అందించారు. ఈ చిత్రానికి ఫోటోగ్రఫీ: ఎం.సుకుమార్, సంగీతం: జామ్8, ఫైట్స్: పీటర్ హెయిన్, స్క్రీన్‌ప్లే: దీపక్ రాజ్, మాటలు: శ‌్రీనివాసరెడ్డి, అడిషనల్ డైలాగ్స్: రవిరెడ్డి మల్లు, ఎడిటింగ్: గౌతంరాజు, ఆర్ట్: రమణ వంక, ప్రొడక్షన్ కంట్రోలర్: కొత్తపల్లి మురళీకృష్ణ తదితరులు.
https://www.youtube.com/watch?v=MH62HsNbDtk