Friday, May 10, 2024
- Advertisement -

ధోనీ పై విమ‌ర్శ‌ల‌కు కౌంట‌ర్ ఇచ్చిన స‌చిన్‌…

- Advertisement -

ఈ ప్రపంచ‌క‌ప్‌లో వికెట్ కీప‌ర్ ధోనిపై విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. ధాటిగా ఆడలేకపోవడం, క్రీజులో జోరుగా పరుగెత్తకపోవడం పట్ల నెటిజన్ల తో పాటు మాజీ క్రికెట‌ర్ల‌నుంచి విమర్శలు ఎదుర్కొంటున్నాడు. ఆప్ఘ‌న్‌, బంగ్లా పై ధోనీ బ్యాటింగ్‌ శైలిపై సోషల్‌ మీడియాలో ఆగ్రహం వెల్లువెత్తుతోంది. బంగ్లాతో జ‌రిగిన మ్యాచ్‌లో భార‌త్ 350 కి పైగా ప‌రుగులు చేసె అవ‌కాశం ఉంది.కానీ ధోనీ స్లోగా ఆడటం వల్లే ఎక్కువ స్కోరు చేయలేకపోయామని ఫ్యాన్స్‌ సోషల్‌ మీడియాలో తమ ఆగ్రహం వెళ్లగక్కుతున్నారు.

ఇప్పటికే టీమిండియా మాజీలు, కోహ్లీ తదితరులు ధోనీకి మద్దతుగా మాట్లాడారు. మాస్టర్‌ బ్లాస్టర్ సచిన్‌ మాత్రం అఫ్గాన్‌ మ్యాచ్‌లో ధోనీ ప్రదర్శన నిరాశ కలిగించిందని అన్నాడు. ధోనీని విమర్శులు చుట్టుముట్టిన నేపథ్యంలో తాజాగా మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ టెండూల్కర్‌ మళ్లీ స్పందించాడు. బుధవారం బంగ్లాతో జరిగిన మ్యాచ్‌లో ధోనీ 33 పరుగులు చేయడంపై సచిన్‌ సంతృప్తి చెందినట్లున్నాడు. 33 పరుగులు చిన్న విషయమేమీ కాదంటూ ధోనీకి మద్దతుగా నిలిచాడు.

ధోనీ ఎప్పుడు వ్యక్తిగత రికార్డుల కంటే జట్టు గురించే ఎక్కువగా ఆలోచిస్తాడని సచిన్‌ పేర్కొన్నాడు. ‘ధోనీ ఇన్నింగ్స్‌ ముఖ్యమైనది. జట్టుకు అవసరమైనదే ధోనీ చేశాడు. 50 ఓవర్లకు అతను ఆడివుంటే.. చివరివరకు అతను తన సహచరులకు అండగా ఉండేవాడు. జట్టుకు ఒక ఆటగాడిగా ఏం చేయగలడో అంతా చేశాడు. 33 పరుగులంటే చిన్న విషయం కాదు కదా!’ అని మాట్లాడాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -