Saturday, April 27, 2024
- Advertisement -

బ‌న్నీకి డ్యాన్స్ నేర్పించ‌నున్న‌లేడీ

- Advertisement -

నా పేరు సూర్య‌.. సినిమాకు వైభ‌వీ మ‌ర్చంట్ ఎంపిక‌

డ్యాన్స్‌ల్లో అల్లు అర్జున్ ఇర‌గదీసేస్తాడు. అత‌డి న‌ట‌న‌తో పాటు డ్యాన్స్‌ల‌కు సినిమాల్లో ముఖ్య పాత్ర పోషిస్తుంది. అల్లు అర్జున్‌తో సినిమాలు తీసేవారు డ్యాన్స్‌ల‌పై ప్ర‌త్యేక శ్ర‌ద్ధ పెడ‌తారు. ఇటీవ‌ల విడుద‌లైన దువ్వాడ జ‌గ‌న్నాథం సినిమాలో బ‌డిలో గుడిలో పాట డ్యాన్స్ కూర్చొని కూడా అద‌ర‌గొట్టేలా చేశాడు. ఆ డ్యాన్స్ చూసి ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. దేశ‌ముదురులో అన్ని పాట‌లు, భ‌ద్రీనాథ్ సినిమాలో, రేసుగుర్రంలో సినిమా సూపిస్తా మామ పాట త‌దిత‌ర పాట‌ల్లో డ్యాన్స్‌ల‌తో అద‌రగొట్టేశాడు బ‌న్నీ. డ్యాన్స్‌ల‌పై ప్ర‌త్యేకంగా ఫోక‌స్ పెడ‌తారు. అలాంటి బ‌న్నీకి డ్యాన్స్ నేర్పించ‌డానికి ఓ లేడీ రాబోతోంద‌ని టాక్‌. అదేందో చూద్దాం.

సరైనోడు సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ పొందిన స్టైలిష్‌ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా సినిమాలో నటిస్తున్నాడు. రచయిత వక్కంతం వంశీని దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఈ సినిమాలో బన్నీ సైనికుడిగా న‌టిస్తున్న‌ట్లు తెలుస్తోంది. ప్రస్తుతం షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుగుతోంది. తన డ్యాన్స్‌లో మార్పులు చేయ‌డానికి ఇత‌ర భాష సినీ ప‌రిశ్ర‌మ‌ల నుంచి నృత్య దర్శకులను తీసుకుంటుంటారు. అదే మాదిరి నా పేరు సూర్య నా ఇల్లు ఇండియాకు ఓ లేడీ కొరియోగ్రాఫర్ పనిచేస్తున్నట్లు తెలిసింది. జాతీయ అవార్డు సాధించిన నృత్య దర్శకురాలు వైభవీ మర్చంట్ బన్నీ సినిమాకు కొరియోగ్రాఫీ అందిస్తోంది. బాలీవుడ్‌లో డోల్ బాజే, హమ్మ హమ్మ రీమిక్స్‌లాంటి పాటలకు కొరియోగ్ర‌ఫీ చేశారు.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -