Friday, May 3, 2024
- Advertisement -

యాక్షన్ స్టార్ పై మీ…టూ..బాంబ్ పేల్చిన హీరోయిన్

- Advertisement -

దేశ వ్యాప్తంగా ఉధృతం అయిన #మీటూ ఉద్యమం లైంగిక వేధింపులకు పాల్పడిన, అసభ్యంగా ప్రవర్తించిన పలువురు స్టార్స్ భాగోతాలు బట్టబయలు చేస్తోంది. ఒక్క‌క్క‌రే మీడియా ముందుకు వ‌చ్చి సంచ‌ల‌న విష‌యాలు వెల్ల‌డిస్తున్నారు. తాజాగా మరో అతిపెద్ద స్టార్ పేరు బయటకు వచ్చింది. సౌత్ ఇండియాలో యాక్షన్ హీరోగా పేరు గడించడంతో పాటు తెలుగు, తమిళం, కన్నడలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అర్జున్ సార్జా మీద తాజాగా ఆరోపణలు వచ్చాయి.

దక్షిణాదిలో ప్రస్తుతం తమిళనాడు కేంద్రంగా ‘మీ..టూ..’ ఉద్యమం ఉధృతమవుతోంది. గాయని చిన్మయి శ్రీపాద, రచయిత వైరముత్తుపై ఆరోపణలు చేయడం తెల్సిన విషయమే. తాజాగా, ఇప్పుడు తమిళ నటుడు, తెలుగు – కన్నడ ప్రేక్షకులకూ సుపరిచితుడైన అర్జున్‌పై ‘మీ..టూ..’ ఆరోపణలు రావడంతో అంతా షాక్‌కి గురయ్యారు.

తమిళ, కన్నడ ప్రేక్షకులకు సుపరిచితురాలైన శృతి, ఓ సినిమా షూటింగ్‌లో అర్జున్‌, తనను లైంగికంగా వేధించినట్లు ఆరోపించింది. సోషల్‌ మీడియా వేదికగా అర్జున్‌పై ఆమె సోషియ‌ల్ మీడియా వేదిక‌గా తీవ్రమైన ఆరోపణలు చేసేసింది.సినిమా షూటింగ్‌ సందర్భంగా దర్శకుడు చెప్పకుండానే అర్జున్‌, తనను గట్టిగా కౌగలించుకున్నాడనీ, తన వీపు భాగాన్నీ, ఆ కింద భాగాన్నీ ‘వేరే భావనతో’ గట్టిగా నొక్కాడనీ, ఆ క్షణంలో తాను చాలా ఇబ్బందికరంగా ఫీలయ్యాననీ
బాంబు పేల్చింది.

నిజానికి, అర్జున్‌ వివాదాలకు దూరంగా వుంటాడు. అలాంటి అర్జున్‌పై ‘మీ..టూ..’ ఆరోపణలు రావడం ఆశ్చర్యకరమే. దొరికేదాకానే ఎవరైనా దొరలు.. అని అర్జున్‌ విషయంలోనూ నిరూపితమవుతుందా.? వేచి చూడాల్సిందే.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -