Monday, April 29, 2024
- Advertisement -

శ‌బ‌రిమ‌ళ‌లో దేశ వ్యాప్తంగా అంద‌రినీ ఆక‌ర్శిస్తున్నా చిన్నారి అయ్య‌ప్ప భ‌క్తురాలు

- Advertisement -

అయ్యప్ప స్వామి మాలధారణలోని ఓ తొమ్మిదేళ్ల బాలిక శబరిమలలో అందరి దృష్టిని ఆకర్షించింది. తన వయస్సు 50 ఏళ్లు దాటిన తర్వాత మళ్లీ శబరిమల అయ్యప్ప స్వామి ఆలయాన్ని దర్శించుకుంటానంటూ ఆ బాలిక ప్లకార్డును ప్రదర్శించింది.ఇది ఇప్పుడు సంచ‌ల‌నంగా మారింది.

సుప్రీం తీర్పు అనంతరం తొలిసారి నెలవారీ క్రతువు కోసం శబరిమల ఆలయం బుధవారం తెరుచుకోగా, మహిళల ప్రవేశంపై పెద్ద ఎత్తున ఆందోళనలు చోటుచేసుకున్నాయి. కేరళ ప్రభుత్వం సుప్రీం తీర్పును అమలు చేస్తామని ప్రకటించడంతో ఘర్షణ వాతావరణం నెలకుంది. శతాబ్దాలుగా సాగుతోన్న సంప్రదాయాలు, ఆచారాలను మంటగలపొద్దంటూ చేపట్టిన ఆందోళనల్లో మహిళలు కూడా పెద్ద సంఖ్యలో పాల్గొవడం విశేషం.

అయితే శబరిమలలో ప్లకార్డు పట్టుకున్న ఓ తొమ్మిదేళ్ల చిన్నారి అందరి దృష్టి ఆకర్షించింది. ‘50ఏళ్ల తర్వాతే మళ్లీ శబరిమలను దర్శించుకుంటాను’ అంటూ ఆ చిన్నారి ప్లకార్డు ప్రదర్శిస్తూ స్వామిపై తన భక్తిభావాన్ని చాటుకుంది. తమిళనాడులోని మదురైకి చెందిన జనని తన తండ్రితో కలిసి మాలధారణలో శుక్రవారం శబరిమల ఆలయాన్ని దర్శించుకుంది.

తన కుమార్తెకు పదేళ్లు నిండిన తర్వాత శబరిమలకు రావడం తనకు ఇష్టంలేదని జనని తండ్రి సతీష్ కుమార్ మీడియాతో చెప్పారు. 50 ఏళ్లు నిండిన తర్వాత జనని మళ్లీ శబరిమల ఆలయాన్ని దర్శించుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. మా ఇలవేల్పు అయ్యప్పస్వామిని మళ్లీ దర్శించుకునేందుకు 50 ఏళ్లు నిండే వరకు వేచిచూసేందుకు జనని సిద్ధమని ఆమె తండ్రి అన్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -