- Advertisement -

#MeToo, శ‌మ‌రిమ‌ళ ఇష్యూ పై తొలిసారిగా స్పందించిన త‌మిళ స్టార్ ర‌జినీ

- Advertisement -

శ‌బ‌రిమ‌ళ‌, మీటూ ఉద్య‌మం దేశాన్ని ఓకుదుపు కుదిపేస్తున్నాయి. వాటిపై ఇప్ప‌టికే అన్ని రంగాల ప్ర‌ముఖులు స్పందించారు. తాజాగా త‌మిళ‌స్టార్ రజినీ కాంత్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. పురుషులతో పాటు మహిళలు అందరికీ శబరిమల ఆలయంలో ప్రవేశాన్ని కల్పిస్తూ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ స్వాగతించారు.అయితే శబరిమల ఆలయంలో అనాదిగా వస్తున్న సంప్రదాయాన్ని దృష్టిలో ఉంచుకుని నడుచుకోవాలని సూచించారు.

మహిళలకు సమాన అవకాశాలు కల్పించడాన్ని ఎదరూ వ్యతిరేకించరు. కానీ మత సంబంధమైన అంశాల్లో మహిళలకు సమాన అవకాశాలతో ముడిపెట్టవద్దు. అనాదిగా వస్తున్న ఆచారాలను పాటించడం.. మహిళలపై వివక్ష చూపడం కాదని తెలుసుకోవాలని’ అభిప్రాయపడ్డారు.

దేశం మొత్తాన్ని కుదిపేస్తున్న #MeToo (మీటూ) ఉద్యమం మహిళలకు మేలు చేస్తుందన్నారు. దీనిపై రాజకీయ నాయకులు స్పందించడం సరైన చర్య అన్నారు. అయితే తమ వ్యక్తిగత, ఇతరత్రా అంశాల కారణంగా మహిళలు ఈ ఉద్యమాన్ని తప్పుదోవ పట్టించకూడదన్నారు. అలా చేస్తే బాధిత మహిళలకు న్యాయం జరగదన్నారు. ప్రస్తుతం ఆయన కార్తిక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో ‘పేటా’ అనే సినిమాలో నటిస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -