Saturday, May 4, 2024
- Advertisement -

సమంతకు శృంగారం అంటే తెగ ఇష్టమట

- Advertisement -

సమంత ఇప్పుడు.. వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మాట్లాడినట్లే మాట్లాడుతోంది. గతంలో వర్మ తనకు మూడుపూటలా శృంగారం ఉండాల్సిందేనని చెప్పిన విషయం తెలిసిందే. తనకు ప్రతి రోజు శృంగారం ఉండాల్సిందేనని సమంత చేసిన వ్యాఖ్యలపై ఫ్యాన్స్ షాక్ అయ్యారు. జస్ట్ ఫర్ విమన్ మేగజీన్‌కు ఫోటో షాట్ చేసిన సందర్భంగా చేసిన ఇంటర్వ్యూలో.. సమంత మాట్లాడుతూ.. ప్రతిరోజూ శృంగారం ఉండాలని తెలిపింది. ఆకలి ఎలాగో శృంగారం కూడా అలాగేనని చెప్పింది. ప్రతి ఒక్కరికీ ఇది సర్వసాధారణమేనని చెప్పింది. ఈ వ్యాఖ్యలు విని సినిమాల్లో సమంతకు, నిజజీవితంలో సమంతకు అస్సలు పోలిక లేదనని ఫ్యాన్స్ అంటున్నారు. అలానే సమంత సమయాన్ని వృధా చేయనంటోంది. ఖాళీగా ఉండటం ఇష్టముండదని.. టైమ్ దొరికితే సామాజిక సేవా కార్యక్రమాలతో పాటు షాపింగ్ చేస్తానని చెప్పింది. అలా షాపింగ్ మాల్స్ ఓపెనింగ్ ద్వారా వచ్చే ఎమౌంట్‌లో మాత్రం తాను పైసా తీసుకోనని చెబుతోంది. ఆ డబ్బంతా ‘ప్రత్యూష ఫౌండేషన్’ కి అందజేస్తానని అంటోంది. అలాగే తన పారితోషికంతో కొంత ఆ ఫౌండేషన్‌కి కేటాయిస్తానని వెల్లడించింది. పెళ్లైన తర్వాత తప్పకుండా సినిమాల్లో కనిపిస్తానని స్పష్టం చేసింది. ఇదే ప్రశ్నకు విలేకరులు మళ్లీ మళ్లీ అడగడంతో కొంత అసహనానికి గురైంది. పెళ్లి తర్వాత ఏ వైద్యుడినో, ఇంజినీరునో తమ వృత్తి వదిలేస్తారా..? అదేవిధంగానే తాను కూడా పెళ్ళైనా కెరీర్‌ను కొనసాగిస్తానని చెప్పుకొచ్చింది. పెళ్లి చేసుకున్న త‌ర్వాత ఇంట్లోనే కూర్చుని మగ్గిపొమ్మంటారా? అని ఘాటుగా ప్ర‌శ్నించింది. ప్రస్తుతం సమంత తెలుగులో రామ్ చరణ్ రంగస్థలం సినిమాలో.. అలానే నాగార్జున నటిస్తున్న రాజు గారి గది 2 సినిమాలో నటిస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -