Friday, March 29, 2024
- Advertisement -

వీరిపై సినీ ప‌రిశ్ర‌మ ఎలా స్పందిస్తుంది…?

- Advertisement -

టాలివుడ్ డ్రగ్స్ వివాదంలో ఎక్సైజ్ శాఖ నోటీసులను అందుకున్న హీరోలు రవితేజ, తరుణ్, నవదీప్, తనీష్, హీరోయిన్లు చార్మి, ముమైత్ ఖాన్, దర్శకుడు పూరీ జగన్నాథ్, కెమెరామెన్ శ్యామ్ కే నాయుడు సహా నందు శ్రీనివాసరావు, సుబ్బరాజు, ఆర్ట్ డైరెక్టర్ చిన్నా తదితరుల‌కు అందించారు.అయితే నోటీస‌లు అందుకున్న వారిలో ఎక్కువ మంది హైద‌రాబాద్‌లో లేన‌ట్లు తెలుస్తోంది. కొంతమంది మాత్రమే హైదరాబాద్ లో ఉండి స్వయంగా నోటీసులు అందుకోగా, మిగతా వారి ఇళ్లకు, ఆఫీసులకు వెళ్లిన పోలీసులు అక్కడున్న వారికి నోటీసులు ఇచ్చి వారి సంతకం తీసుకున్నారు.
దర్శకుడు పూరీ జగన్నాథ్ ప్రస్తుతం హైదరాబాద్ లో లేకపోగా, ఆయన ఇంటికి వెళ్లి, అక్కడున్న ఆయన బంధువులకు నోటీసులు ఇచ్చారు. చార్మీ హైదరాబాద్ లో లేకపోవడంతో ఆమె ఆఫీసుకు వెళ్లిన అధికారులు అక్కడి మేనేజర్ కు నోటీసులు ఇచ్చారు. ముమైత్ ఖాన్ కూడా హైదరాబాద్ లో లేకపోవడంతో, ఇక్కడ ఆమె డేట్స్ పరిశీలించే మేనేజర్ కు నోటీసులు స్వయంగా ఇచ్చారు.
ఆర్ట్ డైరెక్టర్ చిన్నా, కెమెరామెన్ శ్యామ్ కే నాయుడు, తరుణ్, సుబ్బరాజు ఇళ్లకు వెళ్లిన సిట్ సిబ్బంది వారి సమీప బంధువులకే నోటీసులు ఇచ్చారు. అధికారులు వెళ్లిన సమయంలో నవదీప్ ఇంట్లోనే ఉండగా, అతనికే స్వయంగా నోటీసులు ఇచ్చారు. రవితేజ షూటింగ్ లో ఉండగా, ఆయన ఇంటికెళ్లి దగ్గరి బంధువుకు విషయం చెప్పి, నోటీసులు ఇచ్చి, అవి అందినట్టు సంతకం తీసుకున్నారు.
తనీష్, నందులకు నోటీసులు ఇచ్చేందుకు వెళ్లగా ఎవరూ అందుబాటులో లేరని సమాచారం. వారికి నోటీసులను ఇచ్చేందుకు నేడు మరోసారి పోలీసులు వెళ్లనున్నారు. కాగా, స్వయంగా నోటీసులు అందుకున్న వారు మాత్రం తప్పనిసరిగా 19 నుంచి వారం రోజుల్లోపు సిట్ విచారణకు హాజరు కావాల్సిందే.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -