Monday, April 29, 2024
- Advertisement -

వ‌ర్మ అంటే న‌చ్చ‌దు కాని …’ల‌క్ష్మీస్ ఎన్టీఆర్’ మాత్రం హిట్ అవ్వాల‌ట‌..!

- Advertisement -

మెగా బ్ర‌ద‌ర్ నాగ‌బాబు ఈ మ‌ధ్య సోష‌ల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటున్నారు. మొన్న‌టి వ‌ర‌కు ఫేస్‌బుక్‌లో మాత్ర‌మే స్పందించే నాగ‌బాబు ఇటీవ‌ల ఓ యూట్యూబ్ ఛానెల్‌ను పెట్టి ప‌లువురిపై కామెంట్స్ చేస్తున్నారు. త‌న త‌మ్ముడు ప‌వ‌న్ క‌ల్యాణ్ జ‌న‌సేన పార్టీకి పరోక్షంగా స‌హాయం చేస్తు టీడీపీ , వైసీపీ పార్టీల‌పై విమ‌ర్శ‌లు చేస్తున్నారు. దీనిలో భాగంగానే జ‌గ‌న్‌,లోకేశ్‌, చంద్ర‌బాబుల‌పై సెటైరిక‌ల్ వీడియోస్ చేస్తున్నారు నాగ‌బాబు. తాజాగా ఆయ‌న ఓ ఇంట‌ర్య్వూలో మాట్లాడుతు.. రామ్ గోపాల్ వ‌ర్మ అంటే నాకు అస‌లు న‌చ్చ‌దు.

అత‌ను త‌మ కుటుంబంపై చేసే కామెంట్స్ చాలా వ‌ల్గర్‌గా ఉంటాయి. కాని మా అన్న‌య్య వ‌ద్దన్న‌డ‌ని అత‌ను గురించి ప‌ట్టించుకోవ‌డం మానేశాం అని తెలిపారు. రామ్ గోపాల్ వ‌ర్మ న‌చ్చ‌డు కాని ఆయ‌న తీసే సినిమా మాత్రం హిట్ అవ్వాల‌ని కోరుకుంటానని తెలిపారు నాగ‌బాబు. రామ్ గోపాల్ వ‌ర్మ ప్ర‌స్తుతం తెర‌కెక్కిస్తున్న సినిమా ‘ల‌క్ష్మీస్ ఎన్టీఆర్‌’. ఎన్టీఆర్ జీవితంలోని చివ‌రి సంఘ‌ట‌న‌ల ఆధారంగా ఈ సినిమాను తీస్తున్నానని ప్ర‌క‌టించారు వ‌ర్మ‌. ఈ సినిమాలో ముఖ్యంగా చంద్ర‌బాబును టార్గెట్ చేసుకున్నార‌ని చిత్ర ట్రైల‌ర్‌ను చూసిన ప్ర‌తి ఒక్క‌రికి అర్థం అవుతోంది.

తాజాగా ఈ సినిమా గురించి నాగ‌బాబు మాట్లాడుతు ‘ల‌క్ష్మీస్ ఎన్టీఆర్‌’ సినిమా మంచి విజ‌యం సాధించాల‌ని కోరుకుంటాన‌ని చెప్పుకొచ్చారు. ఎన్టీఆర్ చివ‌రి రోజుల్లో ఏం జ‌రిగిదో అందరికి తెలియల‌ని, అందుకే ఈ సినిమా విజ‌యం సాధించాల‌ని కోరుకుంటాన‌ని తెలిపారు. గ‌తంలో ఎన్టీఆర్ త‌న‌యుడు బాల‌య్య‌పై కూడా నాగ‌బాబు రెచ్చిపోయారు. బాల‌య్యపై కక్ష్య‌ను నాగ‌బాబు ఇలా తీర్చుకుంటున్నాడ‌ని చాలామంది అభిప్రాయ‌ప‌డుతున్నారు. అందుకే వ‌ర్మ తీసే సినిమాకు నాగబాబు మ‌ద్ద‌తు తెలిపుతున్నారని వారంటున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -