Sunday, May 5, 2024
- Advertisement -

ఎన్టీఆర్ తండ్రిగా మెగా బ్ర‌ద‌ర్‌?

- Advertisement -

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ ప్ర‌స్తుతం అర‌వింద స‌మేత సినిమా షూటింగ్‌లో బిజిగా ఉన్నాడు. ఈ సినిమాకు మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిని ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒక‌టి బ‌య‌టికి వ‌చ్చింది. అదేటంటే సినిమాలో ఎన్టీఆర్‌కు నాన్న‌గా మెగా బ్ర‌ద‌ర్ నాగ‌బాబు న‌టిస్తున్నారనే వార్త సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతుంది.

త్రివిక్రమ్ సినిమాల‌లో తండ్రి పాత్రలకు ఏ తరహాలో ఇంపార్టెన్స్ ఇస్తారో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. తారక్ ఈ సినిమాలో డ్యుయ‌ల్ రోల్‌లో క‌నిపిస్తాడ‌ని తెలుస్తుంది. సినిమాలో హీరోయిన్స్‌గా పూజ హెగ్డె ,ఈషా రెబ్బ న‌టిస్తున్నారు. సినిమాను దస‌రాకు విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు. సినిమా షూటింగ్ హైద‌రాబాద్ న‌గ‌ర శివార్ల‌లో జ‌రుగుతుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -