Tuesday, April 30, 2024
- Advertisement -

నరసింహ రెడ్డి అవతారంలో మెగాస్టార్

- Advertisement -

ఈ మధ్యనే ‘ఖైదీనెంబర్150’ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి ఇప్పుడు ‘నరసింహ రెడ్డి’ సినిమా తో త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, నయనతార, విజయ్ సేతుపతి, తమన్నా, సుదీప్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. రోజు రోజుకి ఈ సినిమాపై అంచనాలు పెరుగుతూ వస్తున్నాయి. చాలా కాలం క్రితం ఈ చిత్ర టీజర్ ను విడుదల చేసిన దర్శక నిర్మాతలు ఇన్నాళ్లకు మళ్లీ ఈ సినిమా మేకింగ్ వీడియోని విడుదల చేశారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

నరసింహా రెడ్డి పాత్రలో చిరంజీవి లుక్ సినిమాకి హైలైట్ అని చెప్పుకోవచ్చు. ఈ వీడియోలో ఈ సినిమాకి సంబంధించి షూటింగ్ కి సంబంధించిన కొన్ని స్టిల్స్ మరియు విజువల్స్ ప్రేక్షకులకు చూపించారు. మేకింగ్ వీడియో ఈ సినిమాపై అంచనాలను రెట్టింపు చేస్తోంది. కొణిదెల ప్రొడక్షన్స్ పతాకంపై రామ్ చరణ్ స్వయంగా భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమాకి అమిత్ త్రివేది సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ మేకింగ్ వీడియో లో రామ్ చరణ్ కూడా అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -