Thursday, May 2, 2024
- Advertisement -

యుద్ధానికి సై అంటున్న పాక్ ప్రధాని ఇమ్రాన్

- Advertisement -

ఆర్టికల్ 370 తర్వా భారత్ ను రెచ్చ గొట్టడానికి పాక్ ప్రయత్నాలు చేస్తూనె ఉంది. అంతర్జాతీయంగా భారత్ పై విషయం కక్కుతున్నా ఎవరూ కూడా మద్దతు తెలపకపోవడంతో మరింత పాక్ లో మరింత అసహనంతో రగిలిపోతోంది. ఇప్పుడు ఏకంగా ప్రధాని ఇమ్రాన్ నోట యుద్ధం అనేమాట వచ్చింది.రద్దు వల్ల యుద్ధం వస్తే దానికి బాధ్యత భారత్‌దే అవుతుందని కారుకూతలు కూస్తోంది.ఈ క్రమంలో పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లో పర్యటించిన ఇమ్రాన్‌ఖాన్‌ మరోసారి నరేంద్ర మోదీ సర్కారుపై విమర్శలు ఎక్కుపెట్టారు.

నరేంద్ర మోదీ తన ఫైనల్‌ కార్డును ఉపయోగించారని.. అయితే ఇందుకు భారత్‌ తప్పక భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుందని హెచ్చరించారు. పీవోకేలో భారత్ ఏ చిన్న చర్యకు పాల్పడినా.. అంతకు పదింతలు దీటుగా జవాబు ఇస్తామని ఆయన వెల్లడించారు. మోదీకి, హిట్లర్‌కు పెద్ద తేడా లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

కశ్మీర్‌ అంశంపై అంతర్జాతీయ సమాజం మాట్లాడకపోవచ్చు. కానీ కశ్మీరీల తరఫున నేను మాట్లాడతానాన్నారు. కశ్మీర్ సమస్యపై తానే ప్రపంచ రాయబారి అవతారం ఎత్తబోతున్నానని …అన్ని అంతర్జాతీయ వేదికలపై దాన్ని లేవనెత్తుతానని ఇమ్రాన్ స్పష్టం చేశారు. ఐక్యరాజ్యసమితి, అంతర్జాతీయ కోర్టుకు వెళతామని, ప్రపంచవ్యాప్తంగా ఉన్న కశ్మీరీలను కూడగడతామని చెప్పారు. ప్రస్తుత విషయాల గురించి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌తో నేను మాట్లాడాను. అదే విధంగా ఇస్లామిక్‌ దేశాలతో కూడా చర్చిస్తాను’ అని పేర్కొన్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -