Sunday, May 19, 2024
- Advertisement -

చిరంజీవి కూతురు రెండో మొగుడు హీరోగా ..

- Advertisement -

తెలుగు సినిమా పరిశ్రమ లో మెగా ఫ్యామిలీ నుంచి వచ్చినంత మంది హీరోలో ఎవ్వరికీ రాలేదు. దాదాపు 9 మంది హీరోలు ఇప్పుడు ఇండస్ట్రీ లో స్టార్ లు గా ఎదుగుతున్న క్రమం లో ఉన్నారు. ఈ విషయం లో తమదొక క్రికెట్ టీం లాంటిది అని కూడా ఆ మధ్య ఒక మెగా హీరో సరదాగా అన్నాడు. ఈ క్రికెట్ టీం లో మరొక హీరో రాబోతున్నాడు అని వార్తలు వస్తున్నాయి.

చిరంజీవి చిన్న కూతురు శ్రీజ అప్పట్లో శిరీష్ భరద్వాజ్ తో వెళ్ళిపోయి తరవాత అతనితో తెగదెంపులు చేసుకుని కూతురు తో సహా తండ్రి దగ్గరకి వచ్చేసిన విషయం తెలిసిందే. ఆమె కీ కళ్యాణ్ అనే పారిశ్రామిక వేత్త కీ పెళ్లి చేసారు . అంగరంగ వైభవంగా కుటుంబ సభ్యుల మధ్య జరిగిన ఈ పెళ్లి గురించి అప్పట్లో వార్తలు బాగానే వచ్చాయి. పెళ్లి కొడుకు హీరోలా ఉన్నాడు అంటూ ప్రశంసించారు అందరూ.

ఇప్పుడు ఆ కళ్యాణ్ అనే చిరంజీవి చిన్నల్లుడు హీరోగా రావడం కోసం ఆసక్తి చూపిస్తున్నాడు అనీ తనంతట తానే ఈ విషయం చిరంజీవి దగ్గర చెప్పగా ఆయన ఇతన్ని కాస్త ఫిజిక్ పెంచి నటన లో బేసిక్ క్లాసులు నేర్చుకోవాలని కోరాడు అనీ చెబుతున్నారు. అంతా సెట్ అయితే మెగా ఫ్యామిలీ నుంచి ఇంకొక హీరో ఖాయం అన్నమాట .

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -