Sunday, May 19, 2024
- Advertisement -

వారిద్దరి వలన కెసిఆర్ కి తలకాయ నొప్పులు

- Advertisement -

పాత మిత్రులు ఇద్దరూ బద్ద శత్రువులు అయ్యారు. ప్రస్తుతం ఒకే పార్టీలో ఉంటున్నా కూడా ఇద్దరి మధ్యనా అగ్గి రాజుకుంటోంది. ఈ పాటికి మీకు అర్ధం అయ్యే ఉంటుంది ఇదంతా ఎర్రబెల్లి, కడియం ల గురించి అని. అవును తెరాస పార్టీ లో వీరిద్దరి మధ్యనా ఉన్న గొడవ కొత్త తలనొప్పిగా మారింది. ఈ గోల కెసిఆర్ నెత్తికి బొప్పి కట్టే వరకూ వెళుతోంది. జనగామ ని ప్రత్యేక జిల్లాగా చేయ్యబోతుంటే కడియం అడ్డుకున్నారు అనే వార్తలు ఎర్రబెల్లి ని సీరియస్ చేస్తున్నాయి.

ఒకే పార్టీలో ఉంటూ కూడా వరంగల్ జిల్లాలో రాజకీయ ఆధిపత్యం కోసం పోరులో ఎత్తుకి పై ఎత్తి వేస్తూ ఒకరి దూకుడుకి మరొకరు బ్రేకులు వెయ్యడం లో బిజీ గా ఉంటున్నారు. రెండేళ్ళ క్రితం తెరాస లో చేరి ఉప ముఖ్యమంత్రి అయిన కడియం శ్రీహరి ఈ మధ్యనే టీడీపీ నుంచి వచ్చిన ఎర్రబెల్లి వీరిద్దరి మధ్యనా పెద్ద యుద్ధమే నడుస్తోంది. పైకి కనిపించని కోల్డ్ వార్ గా దీన్ని విశ్లేషకులు చెబుతున్నారు.

ఎలాగైనా తన ఆధిపత్యాన్ని నిలుపుకొనే క్రమంలో..  ఎర్రబెల్లి ప్రాబల్యం పెరగకుండా ఏ అవకాశం వస్తే దానిని తనకు అనుకూలంగా వాడుకుంటున్నారట! తాజాగా.. తెలంగాణా సీఎం కేసీఆర్ బంగారు తెలంగాణా నినాదంలో భాగంగా కొత్త జిల్లాలు ఏర్పాటు చేస్తున్నారు. వరంగల్ జిల్లా నుంచి కొత్తగా రెండు జిల్లాలు ఏర్పాటు కానున్నాయి. ఇందులో ఒకటి భూపాలపల్లి కాగా మరొకటి మహబూబాబాద్. అయితే మొదట్లో ప్రతిపాదిత జిల్లాల జాబితాలో ఉన్న జనగాం అనూహ్యంగా వెనక్కి వెళ్లిపోయింది. దీనికి కడియం కారణమని వార్తలు వినిపిస్తున్నాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -