హిందువుల గురించి నీచంగా మాట్లాడ్డం, హిందువుల ధర్మం , దేవుళ్ళ ని కించ పరుస్తూ వారి మనోభావాలు హార్ట్ అయ్యేలా మాట్లాడ్డం అసదుద్దీన్ ఒవైసీ కి బాగా అలవాటు. ప్రస్తుతం హైదరాబాద్ పాత బస్తీ లో జరుగుతున్న అల్లర్ల నేపధ్యం లో ఆయన ప్రపంచాన్ని వణికిస్తున్న రాక్షస మూక ఐ ఎస్ మీద ఆసక్తికర కామెంట్ లు చేసారు.
ఐ ఎస్ సానుభూతి పరులని అరస్ట్ చేసిన నేపధ్యం లో ఆయన పోలీసుల మీద సీరియస్ అవుతారు అనీ , అమాయకులైన ముస్లిం యువకులని అరస్ట్ చేసారు అంటూ గొడవ చేస్తారు అనీ అందరూ అనుకున్నారు గానీ ఆయన దానికి రివర్స్ లో మాట్లాడారు. తమ పార్టీ కానీ తాము కానీ ఐ ఎస్ లాంటి నరరూప రాక్షసులకి పూర్తిగా విరుద్ధం అనీ తాము ముందు నుంచీ ఇదే విషయం చెబుతూ వస్తున్నాం అన్నారు ఆయన.
ఐ ఎస్ ని పూర్తి గా అంతం చెయ్యాల్సిన అవసరం ఉంది అని గుర్తు చేసారు. ఇదివరకు రోజుల్లో ఐ ఎస్ నుంచి అసదుద్దీన్ కి బెదిరింపులు వచ్చిన సంగతి తెలిసిందే. మీడియా తో మాట్లాడిన అసదుద్దీన్ ఉగ్రవాదుల అడ్డగా మారుతున్న హైదరాబాద్ లో ఐ ఎస్ ని పూర్తిగా అంతం చెయ్యాలని కోరారు.
