Monday, May 6, 2024
- Advertisement -

జ‌గ‌న్‌కు షాక్ ఇచ్చిన‌ ఇంటెలిజెన్స్ రిపోర్ట్‌…

- Advertisement -

సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో వైసీపీ బంఫ‌ర్ మెజారిటీతో అధికారంలోకి వ‌చ్చిందంటే అది జ‌గ‌న్ ప్ర‌క‌టించిన న‌వ‌ర‌త్నాల ప‌థ‌కాల‌తోనె. పాద‌యాత్ర‌లో ఈ న‌వ‌ర‌త్నాల‌ను ప్ర‌జ‌ల్లోకి తీసుకెల్ల‌డంతో జ‌గ‌న్ స‌క్సెస్ అయ్యారు. జ‌గ‌న్‌తో పాటు పార్టీనాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు ఈ ప‌థ‌కాల‌ను గ‌డ‌ప‌గ‌డ‌ప‌కు తీసుకెల్లారు. ప్ర‌జ‌లు కూడా న‌వ‌ర‌త్నాల‌కు ఆక‌ర్షితులై ఏకంప‌క్షంగా వైసీపీకీ ఓటు వేశారు.

151 సీట్ల‌తో వైసీపీ అధికారంలోకి వ‌చ్చింది. సీఎంగా జ‌గ‌న్ ప్ర‌మాణ‌స్వీకారం చేసిన వెంట‌నె ఫించ‌న్ పెంపు ఫైల్‌పై సంత‌కం చేశారు. బడ్జెట్‌లో కూడా ఈ ప‌థ‌కాల‌కు అవ‌స‌ర‌మైన నిధులు కేటాయించారు. తొమ్మిది హామీలతో సామాన్యుడి జీవితాల్లో కొత్త వెలుగులు నింపాలన్నది జగన్ ఆలోచన. ఆ దిశగానే ఆయన అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి అడుగులు వేస్తున్నారు. ప్రమాణ స్వీకారం నుంచే కూడా జగన్ నవరత్నాల అమలు అంటూ అధికారులను పరుగులు పెట్టిస్తున్నారు. ఎక్క‌డా అవినీతికి తావు లేకుండా ఈ ప‌థ‌కాలు అర్హులైన ప్ర‌తి పేద వాడికి చేరాల‌ని ఇప్ప‌టికే జిల్లా అధికారుల‌ను ఆదేశించారు. స‌మ‌ర్థ వంతులైన అధికారుల‌ను త‌న టీమ్‌లో నియ‌మించుకున్నారు.

అధికారంలోకి వ‌చ్చి రెండు నెల‌లు అవ‌డంతో ఈ ప‌థ‌కాల‌పై ప్ర‌జ‌ల్లో స్పంద‌న ఎలా ఉంద‌నేది ఇంటెలిజెన్స్ ద్వారా రిపోర్ట్‌లు తెప్పించుకున్నారు జ‌గ‌న్‌. అయితే ఆ రిపోర్ట్‌లో షాకింగ్ ఫ‌లితాలు వచ్చాయి. జ‌గ‌న్ అనుకున్న విధంగా ఫలితాలు రాలేదంట‌. ప్ర‌జ‌ల‌నుంచి మిశ్ర‌మ ఫ‌లితాలు వ‌చ్చాయంట‌.

ప్ర‌ధానంగా పింఛ‌న్ ప‌థ‌కంపై కొంత అసంతృప్తి ప్ర‌జ‌ల్లో ఉందంట‌. మూడు వేల రూపాయకు పెంచుతామని చెప్పిన పించను రెండువేల రెండు వందల యాభైకే పరిమితం చేయడం పట్ల అసంత్రుప్తి గా ఉన్నట్లు ఇంటెలెజెన్స్ రిపోర్ట్ తేల్చిందట. అయితే చెప్పిన దానికి కొంత పెంచార‌ని త‌ర్వాత పూర్తిగా రూ.3000 పించ‌ణ్ వస్తుంద‌ని ఆశ‌తో ఉన్నారంట‌.

రైతు భరోసా స్కీం కూడా రైతులకు కొంత మేరకే సంత్రుప్తిని ఇచ్చిందట. ఏడాదికి 12,500 అంటూ జగన్ చెప్పినా అందులో 6500 కిసాన్ సమ్మాన్ నిధిని కలిపి ఇవ్వడం వల్ల రైతులు కొంత నిరాశలో ఉన్నారట. ఏది ఏమైనా ఇది తమకు ఆసరావేనని రైతులు పాజిటీవ్ దృక్ప‌థంతో ఉన్నారంట‌.

న‌వ‌ర‌త్నాల్లో ప్ర‌ధాన‌మైన‌ది మ‌ద్య‌పాన నిషేధం. ఇప్ప‌టి వ‌ర‌కు ఎంద‌రో నాయ‌కులు మ‌ద్య‌పానాన్ని నిషేధిస్తామ‌ని ప్ర‌క‌టించినా చివ‌ర‌కు చేతులెత్తేశారు. కాని జ‌గ‌న్ మాత్రం ద‌శ‌ల‌వారీగా మ‌ద్య‌పానాన్ని నిషేధిస్తామ‌ని ఎన్నిక‌ల ప్ర‌చారంలో ప్ర‌క‌టించారు. అనుకున్న‌ట్లుగానె ఒక‌డుగు ముందుకేసి బెల్ట్ షాపుల‌ను లేకుండా చేశారు. అయితే పూర్తిగా మ‌ధ్య పాన నిషేధం విధిస్తే…ప‌ల్లెల్లో అక్ర‌మంగా నాటుసారా బ‌ట్టీ దుకాణాలు వెలుస్తాయ‌ని ప్ర‌జ‌లు కొంత భ‌యంతో ఉన్నారంట‌. మొత్తానికి జగన్ దూకుడుగా తీసుకుంటున్న కూడా జనంలో ఇంకా పూర్తిగా అనుకూలత రావడం లేదు. న‌వ‌ర‌త్న ప‌థ‌కాల‌ను విజ‌య‌వంతం చేసె బాధ్య‌త మంత్రులు, అధికారుల‌పై ఉంది. జ‌గ‌న్ ఎంత చేసినా క్షేత్ర స్థాయిలో అధికారులు క‌రెక్ట్‌గా లేక‌పోతె ప‌థ‌కాల అమ‌లు సాధ్యం కాదు. ప్ర‌స్తుతం రెండు నెల్ల పాల‌న‌పై వైసీపీ సర్కార్ కొంత ఆందోళలో ఉన్నా పధకాలు పూర్తిగా అమలు అయి పాలన గాడిలో పడితేనే అసలైన జనాభిప్రాయం తెలుస్తుంది విశ్లేష‌కుల అభిప్రాయం.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -