Sunday, May 12, 2024
- Advertisement -

మెగా ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్..!

- Advertisement -

మెగా అభిమానులతో పాటు సినీ పరిశ్రమ కూడా మెగాస్టార్ చిరంజీవి 150వ చిత్రం కోసం ఎంతగానో ఎదురు చూస్తుంది. అయితే ఈ చిత్రం ఎప్పుడెప్పుడు పట్టాలెక్కుతుందా? అని ఎదురు చూస్తున్న మెగా అభిమానులకి ఇది పండుగలాంటి న్యూస్. ఎన్నో ఏళ్లుగా ఊరిస్తూ వస్తున్న చిరు 150వ మూవీ ఎట్టకేలకు పట్టాలెక్కేసింది. రీసెంట్‌గా ఈ సినిమా లాంఛనంగా ప్రారంభం కాగా.. ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి.

ఇప్పటికే కథా కథనాలను ఫైనల్ చేసిన మెగా టీం శుక్రవారం మ్యూజిక్ సిట్టింగ్స్ ప్రారంభించింది. ఈ విషయాన్ని అఫీషియల్‌. గా కన్ఫర్మ్ చేస్తూ.. చిరుతో దిగిన సెల్పీ ఫోటోను సంగీత దర్శకుడు దేవీ శ్రీ ప్రసాద్ తన ట్విట్టర్లో పోస్ట్ చేశాడు. ఈ ఫోటోతోపాటు విత్ ది బాస్ మెగాస్టార్ 150వ సినిమా తొలి రోజు డిస్కషన్స్, వెల్ కం బ్యాక్ సర్ అంటూ ట్వీట్ చేశాడు. దేవి ట్వీట్‌ని బట్టి చూస్తే.. ఈ సినిమా పనులు చకచకా తెరవెనుకే జరుగుతున్నట్లు అర్థమవుతోంది. అంటే.. ఇక త్వరలోనే మెగాస్టార్ ముఖానికి రంగేసుకోవడానికి సిద్ధంగా వున్నారన్నమాట.

కాగా.. తమిళంలో ఘనవిజయం సాధించిన ‘కత్తి’కి రీమేక్గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు వివి వినాయక్ దర్శకుడు. లైకా ప్రొడక్షన్స్‌ సంస్థతో కలిసి రామ్ చరణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. త్వరలోనే ఈ మూవీకి సంబంధించి మరిన్ని వివరాలు అధికారికంగా వెల్లడి కానున్నాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -