Thursday, May 16, 2024
- Advertisement -

నిహారిక ఒక మనసు టీజర్!

- Advertisement -

నాగబాబు కూతురు నిహారిక త్వరలో హీరోయిన్ పరిచయం కాబోతున్న సంగతి తెలిసిందే. మల్లెలతీరంలో సిరిమల్లె పువ్వు’ వంటి ప్రేమకథా చిత్రాన్ని అందించిన రామరాజు ఈ చిత్రానికి దర్శకుడు. ‘ఒక మనసు’ అనే టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నాగ శౌర్య హీరో. మధుర శ్రీధర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ శివరాత్రి సందర్భంగా రిలీజ్ చేసారు. ఫస్ట్ లుక్ కి మంచి స్పందన వచ్చింది. ఈ చిత్రం హెల్తీ ఎంటర్టెన్మెంట్ సబ్జెక్టుతో ఫీల్ గుడ్ గా ఈ సినిమా ఉంటుందని, మెగా ఫ్యామిలీ ఇమేజ్ ఏమాత్రం డ్యామేజ్ కాకుండా, నటిగా నిహారికకు మంచి గుర్తింపు తెచ్చే విధంగా ఉంటుందని అంటున్నారు. ఎక్కువ భాగం షూటింగ్ వైజాగ్ లో జరిగింది.

ఈ చిత్రానికి సునీల్ కశ్యప్ సంగీతం అందించనున్నారు. నిహారిక నటన పరంగా ఫర్వాలేదని ఇప్పటికే ‘ముద్దపప్పు ఆవకాయ్’ అనే వెబ్ సిరీస్ ద్వారా నిరూపించుకుంది. ఇందులో ఆమె కాస్త అల్లరి పిల్లలా కనిపించినా…. ఈ సినిమాలో మాత్రం చాలా డీసెంట్ రోల్ చేస్తోంది. తాజాగా ఈచిత్రానికి సంబంధించిన ఫోటోలు కూడా రిలీజ్ చేసారు. ఈ ఫోటోలు చూస్తుంటే సినిమాలో నాగ శౌర్య-నిహారిక మధ్య వచ్చే సన్నివేశాలు రొమాంటిక్ గా ఉంటాయని స్పష్టమవుతోంది. అయితే ఈ చిత్రం మ్యూజిక్ టీజర్‍ను ఈ రోజే రిలీజ్ చేశారు. ఈ టీజర్ కి మంచి స్పందన వస్తుంది.

{youtube}v=IpxqhM_08oQ{/youtube}

{youtube}v=Lo5Qo29wMJ0{/youtube}

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -