Saturday, May 18, 2024
- Advertisement -

పవన్ పై మరో సారి అల్లు అర్జున్ కామెంట్!

- Advertisement -

అల్లు అర్జున్ హీరోగా తెరక్కేకిన చిత్రం సరైనోడు. ఈ చిత్రం గత నెల రిలీజ్ అయ్యి సూపర్ హిట్ కొట్టడంతో పాటు మంచి కలెక్షన్స్ వసుల్ చేసింది. అయితే ఈ సినిమాకి సంబంధించి సక్సెస్ వేడుకను కొద్ది రోజుల క్రితం విజయవాడలో వైభవంగా నిర్వహించారు. ఇక ఈ వేడుకలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ఎదైనా మాట్లాడమని అభిమానులు, అల్లు అర్జున్‍ను కోరగా, అందుకు అల్లు అర్జున్ చెప్పను బ్రదర్ అంటూ సమాధానం ఇచ్చాడు.

ఇదే విషయంపై సోషల్ మీడియాలో సంచలనం రెపడంతో పాటూ ఈ చెప్పాను బ్రదర్ అనే అంశం ట్రెండిగ్ గా మారింది. కాగా ఈ అంశంపై ఈ స్థాయిలో చర్చ జరగడం గురించి మీరేమంటారు? అని అడిగిన ప్రశ్నకు అల్లు అర్జున్ ఇచ్చిన సమాధానం మరో సారి సంచలనంగా మారింది.

ఓ ప్రముఖ దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పై ప్రశ్నకు సమాధానంగా…” ఇప్పుడూ అదే మాట అంటున్నా. పవన్ గురించి మాట్లాడను బ్రదర్. ఈ ప్రశ్న తప్ప ఇంకేదైనా అడగండి” అన్నారు. ఇక అల్లు అర్జున్ ఈ తరహా సమాధానం ఇవ్వడంతో పవన్ అభిమానులకు ఏ మాత్రం రుచించలేదు. దీంతో చెప్పను బ్రదర్ అనే అంశాన్ని మళ్ళీ ట్రెండ్ చేస్తూ వస్తున్నారు. కాగా మెగా ఫ్యామిలీ హీరోయే అయిన పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడనని, ఈ సందర్భంలో అల్లు అర్జున్ ఇలా ఎందుకు మాట్లాడారన్నది మాత్రం ఇప్పటికి అంతుచిక్కని ప్రశ్నే.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -