Wednesday, May 15, 2024
- Advertisement -

సైరా మూవీలో చిరుతోపాటు మిగితా స్టార్స్ వీరె

- Advertisement -

మెగాస్టార్‌ చిరంజీవి 151వ చిత్రం ఫస్ట్‌లుక్‌ విడుదలైంది. ప్రముఖ దర్శకుడు ఎస్‌.ఎస్‌. రాజమౌళి ఈ ప్రచార చిత్రాన్ని విడుదల చేశారు. మొదటి నుంచి ‘ఉయ్యాలవాడ నరసింహారెడ్డి’ని టైటిల్‌గా అనుకుంటున్నప్పటికీ ‘సైరా నరసింహారెడ్డి’ని చివరికి చిత్ర బృందం ఖరారు చేసింది. ఈ సందర్భంగా చిత్రంలో ప్రధాన పాత్రలు పోషించే వారు, సాంకేతిక నిపుణుల జాబితాను కూడా ప్రకటించారు.

‘బాహుబలి’ని మించేలా ‘సై రా నరసింహారెడ్డి’ సినిమా తెరకెక్కబోతోంది. ఊహకు కూడా అందని భారీ తారాగణంతో ఈ సినిమా రాబోతోంది. బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్‌ తొలిసారిగా తెలుగు సినిమాలో నటించబోతున్నారు. ఈయనతో పాటు పలువురు స్టార్లు ఈ చిత్రంలో నటిస్తున్నారు. సినిమాలో న‌టీ న‌టు క్యారెక్ట్స్ ఇవే..

చిరంజీవి స్వాతంత్య్ర స‌మ‌ర యోధుడు న‌ర‌శింహారెడ్డి..టైటిల్ క్య‌రెక్ట‌ర్‌ను పోషిస్తున్నాడు. పాత్రకు తగిన విధంగా మెగాస్టార్ చిరంజీవి అదిరిపోయే లుక్ లో కనిపించబోతున్నారు. 62 ఏళ్ల వయసులో చిరంజీవి యుద్ధ సన్నివేశాలు, పోరాట సన్నివేశాలతో కూడిన సినిమా ఎంచుకోవడం విశేషం.

షెహన్ షా ఆఫ్ ఇండియన్ సినిమా, బిగ్ బి అమితాబ్ బచ్చన్ ‘సైరా నరసింహారెడ్డి’ చిత్రంలో కీలకమైన పాత్రను పోషిస్తున్నారు. అయితే ఆయన ఏ పాత్రలో నటించబోతున్నారు అనేది త్వరలో ప్రకటించనున్నారు.డేరింగ్ స్టార్ జ‌గ‌న‌ప‌తి బాబు కూడా ప్ర‌ముఖ పాత్ర‌లో న‌టిస్తున్నారు.

క‌న్నడ స్టార్ కిచ్చా సుదీప్ కూడా ఈ చిత్రంలో మెయిన్ రోల్ చేయబోతున్నారు. బాహుబలి సినిమాలోనూ కిచ్చా సుదీప్ ఓ ముఖ్యమైన పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. క్వీన్ ఆఫ్ ఆఫ్ సౌతిండియా సిల్వర్ స్క్రీన్ నయనతార ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది. మెగాస్టార్ చిరంజీవికి జోడీగా ఈవిడ నటించబోతున్నట్లు స్పష్టమవుతోంది

తమిళ స్టార్ విజయ్ సేతుపతి కూడా ఈ చిత్రంలో నటిస్తున్నాడు. విజయ్ సేతుపతి ద్వారా తమిళ మార్కెట్ లో మంచి వసూళ్లు సాధించవచ్చని దర్శక నిర్మాతల ప్రయత్నంగా కనిపిస్తోంది. ఇంత మంది స్టార్స్ న‌టించ‌డం వెనుక భారా ప్లాన్ క‌నిపిస్తోంది. హిందీ, క‌న్న‌డ‌, త‌మిళ మార్కెట్‌ల‌ను కొల్ల‌గొట్టి భారీ వ‌సూల్లు సాధించ వ‌చ్చ‌నె ప్లాన్‌గా క‌నిపిస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -