Monday, May 13, 2024
- Advertisement -

క‌ర్నూలు విడిచి వెల్లాల‌ని ఈసీ ఆదేశాలు జారీ చేసినా నంద్యాల చుట్టూనె

- Advertisement -

నంద్యాల ఉప ఎన్నిక పోలింగ్‌కు స‌మ‌యం ఒక రోజు మాత్ర‌మే ఉంది. నిన్న‌టి సాయంత్ర‌తో ఎన్నికల ప్ర‌చారం ముగిసింది. నాన్ లోక‌ల్ నాయ‌కులంద‌రూ క‌ర్నూలు జిల్లాను విడిచి వెల్లాల‌ని ఈసీ స్స‌ష్ట‌మైన ఆదేవాలు జారీచేసిది. వైసీపీ అధినేత జ‌గ‌న్‌తోపాటు వ‌చ్చిన క్యాడ‌ర్ అంతా జిల్లాను విడిచి వెల్లారు. అయితే టీడీపీ మాత్రం అక్క‌డ‌నే తిస్ట‌వేసి ప్ర‌లోభాల‌కు పాల్ప‌డుతోంది. ముగ్గురు మంత్రులు నంద్యాల చుట్టూనె తిరుగుతున్నారు.

అధికార పార్టీ నంద్యాల‌లో దాదాపు బరి తెగించినట్టుగానే ఉంది. ప్రచారగడుపు ముగియడంతో స్థానికేతరులు జిల్లా వదిలి వెళ్లిపోవాలని ఎన్నికల కమిషన్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినా… మంత్రులు మాత్రం వాటిని లెక్కచేయలేదు. వారు జిల్లాలోనే తిష్టవేసి డబ్బు, మద్యం పంపిణీని పర్యవేక్షిస్తున్నారు. మంత్రులు ఆదినారాయణరెడ్డి, అమర్‌నాథ్‌ రెడ్డి, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిలు… ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించి బనగానపల్లి టీడీపీ ఎమ్మెల్యే ఇంట్లోనే మకాం వేశారు. రాత్రి కూడా అక్కడే ఉన్నారు.

బ‌న‌గాన‌ప‌ల్లే ఎమ్మెల్యే ఇంటిని కేంద్రంగా చేసుకునే నంద్యాల ఎన్నికను పర్యవేక్షిస్తున్నారు. కృష్ణా, గుంటూరు జిల్లాల నుంచి వచ్చిన టీడీపీ నేతలు ఇప్పటికీ నంద్యాల లాడ్జ్‌ల్లోనే తిష్టవేశారు. టీడీపీ నేతలు లోకల్‌లోనే ఉన్న సంగతి తెలిసినా పోలీసులు మాత్రం అటుగా వెళ్లడం లేదు. వైసీపీ నాయకుల‌పై మాత్రం పోలీస‌లు త‌మ ప్ర‌తాపాన్ని చూపిస్తున్నారు.

నంద్యాల రూరల్, గోస్పాడు మండలాల్లో టీడీపీ స్థానికేతర వ్యక్తులు యదేచ్చగా వాహనాల్లో తిరుగుతున్నారు. మద్యం, డబ్బును విచ్చలవిడిగా పంచుతున్నారు. అయినా ఒక్క పోలీస్ కూడా స్పందించే పరిస్థితి కనిపించడం లేదు. ప్ర‌జ‌ల‌ను భ‌య‌బ్రాంతుల‌కు గురి చేస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -