Sunday, May 19, 2024
- Advertisement -

నేను సీఎం రేసులో ఉన్నా..రేణుకా సంచలనం!

- Advertisement -

తెలంగాణ కాంగ్రెస్ నేతల్లో ఎన్నికల్లో గెలవక ముందే సీఎం సీటుపై ఖర్చీఫ్ వేసుకుని కూర్చుంటున్నారు. ఇప్పటికే రేసులో డజను మందికి పైగా నేతలుండగా తాజాగా మరో సీనియర్ నాయకులు వచ్చేసింది. తనకు సీఎం కావాలని ఉందని అయితే ఇదంతా అవుతుందా అని ఆమె ప్రశ్నించారు. కర్ణాటకలో సీఎం సీటు కోసం ఎంత పోరు జరిగిందో చూశాక కూడా తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఈ విధంగా మాట్లాడటం సరికాదన్నారు.

సీఎం కావాలని అందరికి ఉంటుందని కానీ అధిష్టానం నిర్ణయమే శిరోధార్యం అని వెల్లడించారు రేణుకా. ఒకవేళ అధిష్టానం తనను ఎంపిక చేస్తే నేనే సీఎం అవుతానని చెప్పుకొచ్చింది. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమని..తనకు పార్టీలో ఎవరిపై అసంతృప్టి లేదని తేల్చిచెప్పారు.

ఇక ఎన్నికల ప్రచారంలో భాగంగా రేవంత్ దగ్గరి నుండి భట్టి విక్రమార్క, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, జగ్గారెడ్డి, సీతక్క వరకు ఎవరికి వారే తాము సీఎం అంటే తామే సీఎం అభ్యర్థి అని ప్రకటించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌లో పదవుల కోసం తప్ప ప్రజాభివృద్ధి కోసం కాదనే వాదన వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ గెలుపు సంగతి పక్కనపెడితే సీఎం అభ్యర్థి విషయంలో లొల్లి నిజమేనని ఆ పార్టీ నేతలే చెబుతున్నారు. ఆలు లేదు చూలు లేదు కొడుకు పేరు సోమలింగం అన్నట్లు కాంగ్రెస్ పరిస్థితి ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరి ఓవర్ కాన్పిడెన్స్‌కి పోతే కాంగ్రెస్ ఓడిపోయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని ఆ పార్టీ నేతలనే చెబుతున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -