రంగస్థలం సినిమాతో నటుడిగా తానేంటో ప్రూవ్ చేసుకున్నాడు చరణ్. ఇప్పుడిక బోయపాటితో చేయబోయే సినిమాలో లార్జర్ దేన్ లైఫ్ క్యారెక్టర్….. తన సూపర్ స్టార్ ఢం రేంజ్‌కి తగ్గ క్యారెక్టర్ ప్లే చేయబోతున్నాడు చరణ్. చరణ్-బోయపాటిల కాంబినేషన్‌లో రాబోతున్న సినిమా కథాంశం ఏంటో ఇప్పుడు చూచాయగా బయటికి తెలిసిందే. చిరంజీవి కెరీర్‌లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్‌గా…… ఇండస్ట్రీ రికార్డ్ కొట్టిన ఇంద్ర సినిమా స్టైల్‌లో ఈ సినిమా ఉండబోతోందట.
ఫస్ట్ హాఫ్ మొత్తం కూడా ఇంద్ర సినిమాలో చిరంజీవి స్టైల్‌లోనే చాలా సాదా సీదా కుర్రాడిగా చరణ్ కనిపిస్తాడు. ఫస్ట్ హాఫ్‌లో కామెడీ, లవ్ స్టోరీ ఓ రేంజ్‌లో ఉంటాయని యూనిట్ వర్గాలు చెప్తున్నాయి. ఇక సెకండ్ హాఫ్‌లో మాత్రం సాదా సీదా చరణ్ వెనకాల ఉన్న భారీ కథ రివీల్ చేసేలా ఉంటుంది. సినిమాలో సామాజిక ప్రయోజనానికి సంబంధించిన ఒక భారీ విషయాన్ని కూడా టచ్ చేయనున్నాడట బోయపాటి. సెకండ్ హాఫ్‌లో వచ్చే యాక్షన్ ఎపిసోడ్స్ అన్నీ కూడా అటు బోయపాటికి, ఇటు చరణ్‌కి కూడా కెరీర్ బెస్ట్ అనే రేంజ్‌లో ఉంటాయని మెగా వర్గాలు చెప్తున్నాయి. ఇంద్ర సినిమా కథాంశానికి కాస్త దగ్గరగా ఉండే ఈ సినిమాతో మరోసారి రామ్ చరణ్ బాక్స్ ఆఫీస్‌ని షేక్ చేయడం ఖాయమన్న విశ్వాసం మెగా క్యాంప్‌లో వ్యక్తమవుతోంది. ఇంద్ర సినిమాతో ఇండస్ట్రీ రికార్డ్ కొట్టిన మెగాస్టార్‌లాగే ఈ సినిమాతో రామ్ చరణ్ కూడా ఇండస్ట్రీలో ఉన్న అన్ని రికార్డ్స్ బ్రేక్ అయ్యే రేంజ్ హిట్ కొడతాడన్న నమ్మకాన్ని దర్శకుడు బోయపాటి కూడా వ్యక్తం చేస్తున్నాడు.
