Sunday, May 19, 2024
- Advertisement -

మెహరీన్ కు టాప్ హీరోయిన్ అయ్యే సీన్ ఉందా..

- Advertisement -

హాట్ బ్యూటీ మెహర్రీన్.. హ్యాట్రిక్ కోసం తెగ తాపత్రయ పడిపోతుంది. వరుసగా వచ్చే చిత్రాలతో తన ఖాతాలో సక్సెస్ నమోదైతే… రకుల్ స్థాయికి తాను వెళ్లిపోవచ్చనుకుంటుంది. అయితే ఇక్కడ మెహర్రీన్ ఆ స్థాయి హీరోయిన్నేనా అనే ప్రశ్న కూడా తలెత్తుతుంది. అమ్మడు కృష్ణగాడి ప్రేమగాధ చిత్రం తర్వాత సరైన బ్రేక్ రాలేదు. కారణం ఆ ఫిలింలో అమ్మడు పోషించిన పద్దతైన పాత్ర. ఎట్ ది సేమ్ ఆకట్టుకునే ఫిగర్ కూడా మెహర్రీన్ కు లేదు.

కాని తాజాగా అమ్మడు చేసిన మహానుభావుడు చిత్రం రొమాంటిక్ గా వర్కవుట్ కావడంతో కుర్రాళ్ల గుండెల్లో చిన్నది సెగలు పుట్టించింది. ఆ వేడి చల్లారక ముందే ఇంకో మూడు సినిమాలు లైన్ లో ఉన్నాయి. ముందుగా దీపావళి టైమ్ కు వచ్చే రాజా ది గ్రేట్ తో బోణి కొడతానంటుంది. ఈ కాన్ఫిడెంట్ కు కారణం.. ల్యాబ్ టాక్ ఈ సినిమాకు పాజిటివ్ గా రావడం. ఆతర్వాత వచ్చే జవాన్ ,కేరాఫ్ సూర్యలకు పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తూ ఉండడంతో ఇక తనకు తిరుగులేదనుకుంటుంది.

అంతా భాగానే ఉంది కాని.. ఏ యాంగిల్లో అమ్మడు రకుల్ ప్రీత్ తరహాలో టాప్ పొజిషన్ కు ఎగబాకుదామనుకుంటుందో ఎవ్వరికీ అర్ధం కావడం లేదు. సాలిడ్ హిట్లు ఇచ్చే స్థాయి కాదు. టాప్ హీరోల సరసన సెట్ అయ్యే మెటీరియల్ కూడా కాదు .అలాంటి సందర్భంలో ఏవిధంగా మెహరీన్ కు టాప్ గాళ్ అయ్యే సీన్ ఉందో ఆమెను ఆ స్థాయిలో ఊహించుకుంటోన్న వాళ్లు ఓ సారి అర్ధం చేసుకోవాలి. అంటే ఇక్కడ అమ్మడు ఓ రేంజ్ అని చెప్పడం లేదు గాని చోటా హీరోలు,ఇంకాస్త బెటర్ హీరోలకు మెహరీన్ మంచి చాయిస్ అని మాత్రం చెప్పవచ్చు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -