Sunday, April 28, 2024
- Advertisement -

ఓవర్సీస్ బెటరా.. బైలింగువల్ బెటరా..

- Advertisement -

స్పైడర్ చిత్రం ఓవరాల్ ఫలితాలు చూసాకా … టాలీవుడ్ బడా బాబులకు జ్ఞానోదయం కలిగింది. ఇంతకాలం తెలుగు, తమిళ్ భాషల్లో ఒకేసారి సినిమాలు నిర్మించిన తమిళ దర్శకులు మాదిరిగా మనవాళ్లు ఆలోచించి హిట్ కొట్టాలనుకోవడం …ఎక్కడో తేడా కొట్టింది.బాహుబలి,శ్రీమంతుడు విజయాలు సాధించాయి కాబట్టి వారు అలా ఊహించి ఉండవచ్చు. అయితే ఫలితాలు ఎప్పుడూ మనకు అనుకూలంగా రావు కదా. ఇక్కడా అదే జరిగింది.

స్పైడర్ ఫ్లాప్ తర్వాత మహేష్ మాత్రమే కాదు.. అటు అల్లు అర్జున్ కూడా కాస్త గందరగోళంలో పడిపోయాడని తెలుస్తోంది. మన చిత్రాన్నే డబ్ చేసి ఆయా భాషల్లో విడుదల చేయాలి గాని ఇలా బైలింగువల్ జోలికి పోకూడదని డిసైడ్ అయ్యాడు. ఇలాంటి ప్రయోగాల వలన బడ్జెట్ కు దెబ్బ పడిపోతుందనే విషయాన్ని వారు భాగానే అర్ధం చేసుకున్నారు. అందుకే దీనికి విరుగుడుగా ఉన్నదాంట్లోనే బెటర్ మెంట్ కోసం ఓవర్సీస్ పై ఎందుకు ఫోకస్ చేయకూడదని డిసైడ్ అయ్యారు.

ఒకవేళ ఓవర్సీస్ లో ఏమాత్రం స్క్రీన్లు పెంచుకున్నా… డబ్ చేయడం ద్వారా అక్కడ మంచి కలెక్షన్లను రాబట్టవచ్చని బడాబాబులు డిసైడ్ అయ్యారు. అదే సేఫ్ గేమ్ అని మనవాళ్లు థింక్ చేస్తున్నారు. మణిరత్నం,శంకర్ తో పాటు కొందరు తమిళ నటుల చిత్రాలు తెలుగులో వస్తున్నాయంటే దానికి కారణం కంటెంట్ ఉన్న కథలు. కోలీవుడ్ తో పోల్చితే మన సినిమాలలో అంత గొప్ప కథలు కావు కాబట్టి.. ఉన్న సినిమానే మరిన్ని స్క్రీన్లు పెంచుకోవడం, డబ్ చేయడం ద్వారా వచ్చిందే మహాభాగ్యమని ఓ అండర్ స్టాండ్ కు వచ్చేశారట.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -