Saturday, May 4, 2024
- Advertisement -

మ‌ల్టీస్టార‌ర్‌లో వ‌రుణ్ జోడిగా మెహ‌రీన్‌

- Advertisement -

కృష్ణగాడి వీర ప్రేమగాథ సినిమాలో త‌న న‌ట‌న‌తో హీరోయిన్‌గా ఆక‌ట్టుకున్న మెహరీన్ ఓ ఏడాది త‌ర్వాత సినిమాల జోరు పెంచింది. వ‌రుస సినిమాలు తీస్తూ విజ‌యాలు అందుకుంటోంది. గతేడాది మహానుభావుడు, రాజా ది గ్రేట్ సినిమాలతో మంచి విజ‌యాలు అందుకున్న మెహ‌రీన్ త‌న సినిమాల సంఖ్య‌ను పెంచుకోబోతోంది. ఇటీవ‌ల మెగా హీరో సాయిధరమ్‌తేజ్ సరసన న‌టించిన జవాన్ సినిమా ప‌రాజ‌యం పొందింది. ఆ త‌ర్వాత మ‌రికొన్ని సినిమాల‌ను అంగీక‌రించింది. ఇప్పుడు వినిపిస్తున్న ముచ్చ‌ట ఏంటంటే వ‌రుణ్‌తేజ్ జోడిగా న‌టించ‌నుందట‌.

అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేశ్‌, వరుణ్ తేజ్ క‌లిసి ఓ మ‌ల్టీస్టార‌ర్ సినిమా చేస్తున్నారు. ఎఫ్ 2 (ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్‌) పేరుగా ఫిక్స్ చేశారంట‌. ఈ సినిమాను దిల్ రాజు నిర్మిస్తున్నాడు. ఇందులో ఒక హీరోయిన్‌గా వరుణ్‌తేజ్‌కు జోడిగా మెహరీన్ నటించనుందని స‌మాచారం.

https://www.youtube.com/watch?v=LGY94Ww1dsM

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -