Tuesday, May 14, 2024
- Advertisement -

టీఆర్ఎస్ నేత‌పై బాణాన్ని ఎక్కుపెట్టిన శ్రీరెడ్డి… ఫుల్ కుషీగా ఉన్న కాంగ్రెస్ నేత‌లు

- Advertisement -

టాలీవుడ్ లో క్యాస్టింగ్ కౌచ్ భూతంపై పెద్ద పోరాటమే చేస్తున్న నటి శ్రీరెడ్డి… తాజాగా మరోసారి వార్తల్లోకెక్కింది. ఈస ఆరి త‌న బాణాన్ని టీఆర్ఎస్ పార్టీలో ఎక్కుపెట్టింది. ఇప్ప‌టి వ‌ర‌కు సినీ ప్ర‌ముఖ‌ల పేర్ల‌నే బ‌య‌ట‌పెట్టిన శ్రీరెడ్డి ఇప్పుడ రాజ‌కీయ నాయ‌కుల పేర్ల‌ను కూడా బ‌య‌ట పెట్టింది. అస‌లే ఎన్నిక‌ల నేప‌థ్యంలో టీఆర్ఎస్ నేత‌ల‌పై చేసిన ఆరోప‌న‌లు క‌ల‌క‌లం రేపుతున్నాయి.

ఇక క్యాస్టింగ్ కౌచ్ అంశం ఇప్పటి వరకు సినీ ఇండస్ట్రీకే పరిమితం కాగా శ్రీరెడ్డి బయటపెట్టిన వ్యక్తులపేర్లతో అది కాస్త పొలిటికల్ సర్కిల్స్‌కు తాకింది. తాజాగా శ్రీరెడ్డి ఓ యువ ఎమ్మెల్యే పేరును ప్రస్తావించింది. టీఆర్ఎస్ నేత, ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి తనపై లైంగిక దాడికి పాల్పడ్డాడని సంచలన ఆరోపణలు చేసింది. చెన్నైలో ఓ ప్రముఖ న్యూస్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో భాగంగా శ్రీరెడ్డి ఈ వ్యాఖ్యలు చేసింది.

జీవన్‌రెడ్డి పెద్ద అమ్మాయిల పిచ్చోడని.. హైదరాబాద్‌లోని పార్క్‌హయత్ హోటల్‌లో చాలామంది అమ్మాయిలను వాడుకున్నాడని.. అలా అతని అత్యాచారాలకు బలైన చాలామంది అమ్మాయిల పేర్లు తన వద్ద ఉన్నాయన్నారు. ప్రస్తుతం తెలంగాణలో ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో శ్రీరెడ్డి ఆరోపణలు విపక్షాలకు ఆయుధాలుగా మారనున్నాయి.

ఎప్పుడూ గట్టిగా ధైర్యంగా టీఆర్ఎస్ తరపున పలు టీవీ చర్చా కార్యక్రమాల్లో పాల్గొనే జీవన్ రెడ్డిపై ఇలాంటి ఆరోపణలు రావడంతో ఒక్కసారిగా టీఆర్ఎస్, ఆర్మూర్ ప్రజల్లో అంశం చర్చనీయాంశంగా మారింది. తనపైనా రెండు, మూడు సార్లు లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని.. కానీ తాను లొంగిపోలేదన్నారు. ఈ క్రమంలో తాను స్లీపింగ్ ప్రొడ్యూసర్‌ని అని.. అధికార పార్టీలో ఉన్నాను కాబట్టి అంతా నా చేతిలోనే ఉందన్నాడు. మున్ముందు ఇంకెంత మంది రాజ‌కీయ నాయుల పేర్ల‌ను బ‌య‌ట పెడుతుందో చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -