హైదరాబాద్‌లోని శిల్పకళావేదికలో జనతా గ్యారేజ్ ఆడియో ఫంక్షన్ శుక్రవారం గ్రాండ్ గా జరిగింది. ఈ ఆడియో వేడుకలో జూనియర్ అభిమానుల హంగామా, ఉత్సాహం ఉరకలేస్తూ.. ఓ రేంజ్‌లో ఉంది. ఆ ఉత్సాహం తారాస్థాయికి చేరి చాలా మందిని ఇబ్బంది పెట్టేసింది కూడా. చివరకు ఎన్టీఆర్ స్వయంగా వాళ్లను వేడుకోవాల్సి వచ్చింది. డైరెక్టర్ కొరటాల శివ మాట్లాడుతున్నపుడు ఆయన మాటలు వినిపించనంత రేంజ్ లో ఫ్యాన్స్ అరుపులు కేకలు పెట్టేశారు.
దాంతో ఎన్టీఆర్ కొరటాల నుంచి మైక్ తీసుకొని డైరెక్టర్ మాట్లాడుతుంటే.. అందరూ సైలెంట్ గా ఉండాలని కోరుతున్నా. మధ్యలో ఇలా చేయడం కరెక్ట్ కాదు. మనకు సూపర్ హిట్ ఇవ్వాలని ఆరు నెలలుగా కష్టపడుతున్న వ్యక్తి ఇప్పుడు మాట్లాడుతున్నాడు. మనం ఆయనకు గౌరవం ఇవ్వాలి. ప్లీజ్. ఈ సినిమాకి ఆయన పడిన కష్టం అందరికీ తెలియాలి. అది ఆయన పడిన కష్టం. అది ఆయన నోటితో పంచుకుంటే అందరికీ బాగుంటుంది’ అని చెప్పాడు. అయితే ఫ్యాన్స్ ఫీల్ కాకుండా ఉండేందుకు… మీరు అరుస్తా ఉన్నా మాకు అది కూడా ఇష్టమే. మీ అరుపులు మా మాటలు కలిపితే ఇంకా బాగుంటాయ్ అని డైరెక్టర్ కొరటాల శివ ఈ ఇష్యూని సైలెంట్ చేశాడు.
ఇక ఈ వేడుకకు నందమూరి ఫ్యామిలీ నుంచి ఎవరు రాలేదు. కొన్ని రోజులుగా ఎన్టీఆర్, బాలకృష్ణకు పడటం లేదు అని వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. అందుకే నందమూరి ఫ్యామిలీ నుంచి ఎవరు రాలేదు అని అంటున్నారు. ఇక ఈ ఆడియో వేడుకకు సమంత వస్తుంది అని ఫ్యాన్స్ ఆశపడ్డారు. కానీ ఈ వేడుకకు సమంత రాలేదు. నాగచైతన్య తో ప్రేమలో ఉన్న సమంత త్వరలో పెళ్లి చేసుకోబోతుంది అని ఇక సినిమాలు చేయదు అని ఈ జనతా గ్యారేజ్ ఆడియోకి ఖచ్చితంగా వస్తుందని అని ఆశపడ్డారు ఫ్యాన్స్. కానీ తనకు ఒంట్లో బాగోలేదని, అందుకే ఆడియో పంక్షన్ కి రాలేకపోతున్నాను అని.. ఆడియో వేడుకను మిస్సవుతున్నందుకు బాధగా ఉందంటూ తన ట్విట్టర్ ద్వారా తెలిపింది సమంత.
{youtube}v=MUoR2idUzlc{/youtube}
Related