Wednesday, May 15, 2024
- Advertisement -

జనతా గ్యారేజ్ లో రెండు క్లైమాక్స్ లు..!

- Advertisement -

టెంపర్, నాన్నకు ప్రేమతో సినిమాల విజయలతో మంచి ఫాంలో ఉన్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కుతున్న కొత్త చిత్రం జనతా గ్యారేజ్. మిర్చి, శ్రీమంతుడు లాంటి సూపర్ హిట్ సినిమాలను తీసిన దర్శకుడు కొరటాల శివ ఈ సినిమాకి దర్శకత్వంలో వహిస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్రంపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

అభిమానుల అంచనాలకు తగ్గట్టుగా భారీ స్టార్ కాస్ట్ తో ఎన్టీఆర్ మార్క్ మాస్ ఎలిమెంట్స్ తో ఈ సినిమాను రూపొందిస్తున్నారు. అయితే ఈ సినిమాలో ముఖ్య పాత్రలో సూపర్ స్టార్ మోహన్ లాల్ నటిస్తుండటంతో ఈ చిత్రంపై మాలీవుడ్ లో మంచి టాక్ వస్తోంది. ఆ టాక్ ను క్యాష్ చేసుకోవాలని భావిస్తున్నారు చిత్రయూనిట్. అందుకోసమే తెలుగు, మళయాల భాషల్లో వేరు వేరుగా క్లైమాక్స్ లను షూట్ చేస్తున్నారట.

ఇలాగే గతంలో దళపతి, ఏం మాయ చేసావే, ఘర్షణ లాంటి కొన్ని సినిమాలకు రెండు క్లైమాక్స్ లను తీసి సక్సెస్ సాధించగా.. ఇప్పుడు కొరటాల శివ కూడా అదే ఫార్ములాను వాడుకుంటున్నాడు. తెలుగులో ఎన్టీఆర్ ఇమేజ్ ను ఎలివేట్ చేస్తూ క్లైమాక్స్ ను చిత్రీకరించి, అలాగే మళయాలంలో మాత్రం మోహన్ లాల్ ను హైలెట్ చేయాలని భావిస్తున్నారట. ఇలా రెండు క్లైమాక్స్ లతో వస్తున్న ఈ చిత్రం ఎలాంటి విజయం సొంతం చేసుకుంటుందో చూడాలి.

Related

  1. ఎన్టీఆర్ కు కళ్యాణ్ రామ్, బన్నీకి ధరమ్ తేజ్ షాక్ ఇచ్చారు
  2. బాహుబలి లో ఎన్టీఆర్ పాట పాడనున్నాడా?
  3. బాల డైరెక్షన్ లో ఎన్టీఆర్!
  4. ఎన్టీఆర్ కి రాజమౌళి షాక్!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -