Wednesday, May 8, 2024
- Advertisement -

హీరో రాజ‌శేఖ‌ర్‌పై కామెంట్స్‌ చేసిన రోజా

- Advertisement -

హీరో రాజశేఖ‌ర్‌ఫై ఒక్క‌ప్పటి హీరోయిన్ ప్ర‌స్తుత ఎమ్మెల్యే రోజా కామెంట్స్ చేశారు.క్యాస్టింగ్ కౌచ్ వివాదంతో గత కొంతకాలంగా టాలీవుడ్ ఉక్కిరిబిక్కిరి అవుతున్న సంగతి తెలిసిందే.శ్రీరెడ్డి మొదలుపెట్టిన క్యాస్టింగ్ కౌచ్ వివాదం త‌రువాత కాలంలో వ్యక్తిగ‌తంగా మార‌డంతో అనేక వివాదాల‌కు దారి తీసిన సంగ‌తి తెలిసిందే.ఈ నేపథ్యంలోనే హీరో జీవిత రాజశేఖర్‌లపై పలు ఆరోపణలు వచ్చాయి.హీరో రాజ‌శేఖ‌ర్ కాలేజీ అమ్మాయిల‌ను వాడుకునేవాడని, దీనికి ఆయ‌న భార్య జీవిత స‌హ‌క‌రించేద‌నే ఆరోప‌ణ‌లు జీవిత రాజశేఖర్‌ల మీద ప్ర‌ధానంగా చేశారు.

తాజాగా ఈ వివాదంపై సీనియర్ నటి, వైసీపీ ఎమ్మెల్యే రోజా స్పందించారు. ఇండస్ట్రీలో ఏదీ దాగదు. ఈరోజు కాకపోతే రేపటి రోజైనా ఆ విషయం బయటకు వస్తుంది. హీరో రాజశేఖర్ ఇండస్ట్రీకి వచ్చి ఇన్నేళ్లు అవుతుంది. ఎప్పుడూ ఎలాంటి ఆరోపణలు లేవు. నిజంగా ఆయనపై వచ్చిన ఆరోపణలు నిజమైతే ఇన్ని రోజులు దాగేది కాదు. రాజశేఖర్ ఎలాంటి వారో నాకు తెలుసు. ఆయనతో కలిసి రెండు సినిమాల్లో నటించా.ఎందుకు ఇలా చేస్తున్నారో నిజా నిజాలు త్వరలోనే తేలుతాయి అంటూ జీవితా రాజశేఖర్‌పై వచ్చిన ఆరోపణలను ఖండించారు రోజా.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -