Wednesday, May 15, 2024
- Advertisement -

క్రెడిట్ మొత్తం కొట్టేస్తున్నాడట

- Advertisement -

కలెక్షన్ కింగ్ మోహన్ బాబు.. కామెడీ కింగ్ అల్లరి నరేష్ కలిసి నటిస్తున్న మల్టీ స్టారర్ మూవీ మామ మంచు.. అల్లుడు కంచు. ఈ సినిమాపై ఇండస్ట్రీలో భారీ అంచనాలే ఉన్నాయి. మల్టీ స్టారర్ కామెడీతో వస్తున్న ఈ మూవీ గురించి ఇండస్ట్రీలో రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి.

ఎంత కామెడీ హీరో అయినా.. అల్లరి నరేష్ ఇప్పుడు స్వింగ్ లో ఉన్నాడు. ఈవీవీ సత్యనారాయణ తనయుడిగా ఇండస్ట్రీలోకి వచ్చిన నరేష్.. ఇప్పుడు తనకంటూ క్రేజ్ సొంతం చేసుకున్నాడు. ఇప్పుడున్న హీరోల్లో.. అల్లరి నరేష్ సినిమా వస్తోందంటే… చూసి ఎంజాయ్ చేసేందుకు చాలా మంది ప్రేక్షకులు వెయిట్ చేస్తుంటారు. ఇంకో పక్క మోహన్ బాబు సీనియారిటీ గురించి.. హీరోగా ఆయన డైనమిజమ్ గురించి స్పెషల్ గా చెప్పాల్సిన పనిలేదు. అలాంటి ఈ ఇద్దరూ కలిసి నటిస్తుండడంతో.. టైటిల్ అనౌన్స్ అయినప్పటి నుంచీ ఇండస్ట్రీతో పాటు.. మామూలు ప్రేక్షక జనాల్లోనూ క్యూరియాసిటీ పెరుగుతోంది.

ఇది గమనించిన మంచు ఫ్యామిలీ… మోహన్ బాబుకు హైప్ ఇస్తూ.. అల్లరి నరేష్ కు అంత పబ్లిసిటీ ఇవ్వడం లేదని ఇండస్ట్రీ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి. ఇది నరేష్ 50వ సినిమాగా కొందరు చెబుతున్నా… ఆ మైల్ స్టోన్ ను పెద్దగా ప్రచారంలోకి రానీయకుండా.. మోహన్ బాబే సినిమాకు కర్త కర్మ క్రియగా ప్రచారం జరుగుతున్నట్టు తెలుస్తోంది. ఇలాంటి సిచువేషన్ లో మంచు ఫ్యామిలీని నరేష్ ప్రశ్నించలేకపోవడం.. అది నరేష్ కు మైనస్ గా మారడం.. అంతా గమనిస్తున్నారు. ఇందులో నిజం ఎంతో అబద్ధం ఎంతో కానీ… నిప్పు లేనిదే పొగ రాదని కొందరు నరేష్ తరఫున మద్దతుగా మాట్లాడుతున్నారు.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -