Friday, May 3, 2024
- Advertisement -

ఈ కామెడియన్ టాలీవుడ్ లో బ్రహ్మానందం ప్లేస్ కు ఎర్త్ పెట్టేసినట్టే!

- Advertisement -

‘శంకరాభరణం’ సినిమాలో ఎంతో మంది కామెడియన్లున్నారు. అంతమంది చేత ఆ సినిమాలో విన్యాసాలు చేయించిన కోన వెంకట్ బ్రహ్మానందానికి మాత్రం పాత్ర ఇవ్వలేదు. ఎక్కడెక్కడి కామెడియన్లను నిద్ర నుంచి లేపుకొచ్చిన కోన బ్రహ్మీని మాత్రం విస్మరించాడు.

అదే సినిమాలోపృథ్వీ రోల్ బాగా పండింది. అతడికి మంచి పేరును తీసుకొచ్చింది. సినిమాలో నవ్వించే ఫ్యాక్టర్ పృథ్వీ రోలే అని ఆ సినిమాను చూసిన వారు అంటారు.

ఇక  తర్వాతి వారం వచ్చిన ‘బెంగాల్ టైగర్’ లో కూడా పృథ్వీ కామెడీ బాగా హైలెట్ అయ్యింది. ఈ సినిమాలో పృథ్వీ కనిపించేది కొద్ది సేపే అయినా.. పేరు మాత్రం బాగానే వచ్చింది. ఇక ఈ సినిమాలో బ్రహ్మానందం నటించినా.. ఆ పాత్ర నవ్వించలేదనే పేరును తెచ్చుకొంది. పృథ్వీకి బాగా పేరుచ్చిన ‘శంకరాభరణం’ బ్రహ్మీకి ప్లేసే లేకుండా పోగా.. బ్రహ్మానందం ఉన్నా.. బెంగాల్ టైగర్ లో పృథ్వీ సత్తా చాటాడు!

దీంతో ఇప్పడు పృథ్వీతో బ్రహ్మానందానికి థ్రెట్ వచ్చినట్టే అని ప్రచారం జరుగుతోంది టాలీవుడ్ లో! వరసగా పృథ్వీ పాత్రలు హిట్ అవుతున్నాయి. ఇండస్ట్రీలో హిట్టే ప్రాతి పదిక. బ్రహ్మీ వరస హిట్లలో ఉంటే.. అంతా ఆయన వెంట పడ్డారు. ఇప్పుడు ఆయన ప్లాఫుల్లో ఉన్నాడు.. పృథ్వీ లీడ్ లో ఉన్నారు. దీంతో సహజంగానే.. దర్శక, నిర్మాతల ఛాయిస్ పృథ్వీనే అయ్యే అవకాశం ఉంది. సో.. పృథ్వీ ఎదుగుదల బ్రహ్మీకి డేంజరేనేమో!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -