Saturday, May 4, 2024
- Advertisement -

ఏపీ ప్రత్యేక హోదాపై కేంద్రం సంచలన నిర్ణయం

- Advertisement -

ఏపీ ప్రత్యేక హోదా సాధనే ధ్యేయంగా పనిచేస్తానని జగన్ హామీ ఇచ్చారు. కేంద్రంలోని బీజేపీతో పోరాడుతున్నారు. వివిధ మీటింగ్ లు, ప్రధాని మోడీ, బీజేపీ అధ్యక్షుడు షా వద్ద ఇదే ప్రతిపాదనను వల్లె వేస్తారు. అయితే ప్రతీ సందర్భంలోనూ కేంద్ర హోదా ఆశలపై నీళ్లు చల్లుతూనే ఉంది.

తాజాగా కేంద్రంలోని బీజేపీ సర్కారు ఏపీ ప్రభుత్వానికి స్పష్టం చేసింది. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వడం కుదరదని క్లియర్ కట్ గా చెప్పేసింది. తాజాగా వైసీపీ ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ అడిగిన ప్రశ్నకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్ లిఖిత పూర్వక సమాధానాన్ని ఇచ్చారు. దీంతో ఏపీకి ప్రత్యేక హోదా రాదని తేలిపోయింది.

ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వలేమని.. 14వ ఆర్థిక సంఘం సిఫార్సులతో ఇలాంటి పరిస్థితి ఏర్పడిందని నిత్యానందరాయ్ స్పష్టం చేశారు.

అయితే గుడ్డిలో మెల్లగా కేంద్రం ఏపీకి ఆర్థికలోటు ఉన్న దృష్ట్యా ప్రత్యేక సాయం చేస్తామని హామీ ఇవ్వడం గమనార్హం. కాగా పార్లమెంట్ సాక్షిగా ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వలమేని స్పష్టమైన నేపథ్యంలో ఏపీ సీఎం జగన్ ఏం చేస్తారు.? పార్లమెంట్ లో వైసీపీ ఎంపీలు ఆందోళన చేస్తారా.? సైలెంట్ గా ఉంటారా అన్న దానిపై టెన్షన్ నెలకొంది.

జగన్ కానీ, వైసీపీ ఎంపీలు కానీ ఏపీకి హోదా ఇవ్వలేమన్న కేంద్రం వైఖరిపై అధికారికంగా ఇంతవరకు స్పందించింది లేదు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -