Friday, May 3, 2024
- Advertisement -

ఇద్ద‌రు కంప్లీట్ యాక్ట‌ర్స్ ఓకే సినిమాలో..

- Advertisement -

ఒకే తెరపై అగ్రనటులు కలిసి నటిస్తే ఆ అనుభూతి ఎలా ఉంటుందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఇప్పుడు సౌత్ లో అలాంటి కాంబినేషన్ లు చాలానే రెడీ అవుతున్నాయి. పెద్ద హీరో, మరో స్టార్‌ హీరో సినిమాలో నటించడమో, అతిథి పాత్రలో మెప్పించడమో ఈ మధ్య జరుగుతూనే ఉంది. ఒక సినిమాలో ఇద్దరు స్టార్‌ హీరోలు ఉంటే సినిమా రేంజ్‌ పెరిగిపోతుంది. అదే.. వేరే ఇండస్ట్రీకి చెందిన మరో స్టార్‌ మరో ఇండస్ట్రీకి చెందిన స్టార్‌తో జతకడితే సినిమా స్థాయి అమాంతం పెరిగిపోతుంది.

దర్శకుడు కెవి.ఆనంద్ కోలీవుడ్ లో సూర్య తో ఒక సినిమా చేయనున్నాడు. ఈ సినిమాలో సూర్య తో పాటు మలయాళం కంప్లీట్ యాక్టర్ మోహన్ లాల్ కూడా నటించనున్నారట. ప్రస్తుతం సూర్య ఎన్జీకే (NGK) మూవీలో నటిస్తున్నారు. ఈ సినిమా త‌రువాత మోహ‌న్ లాల్‌,సూర్య‌ల సినిమా సెట్స్ మీద‌కు వెళ్లుతుంద‌ని సమాచారం.

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -