Sunday, May 12, 2024
- Advertisement -

మోహన్ లాల్ ని చూసి సిగ్గు తెచ్చుకోవాలి

- Advertisement -

కనీసం పది పన్నెండు సంవత్సరాల కాలం నుంచీ తెలుగు లో హీరోయిన్ లు గా తమ ఆధిపత్యం చలాయిస్తున్న త్రిష లాంటి హీరోయిన్ లు ఒక్క కార్యక్రమం లో కూడా తెలుగు పదాలు మాట్లాడలేరు. ” బాగున్నారా , సినిమా చూడండి ” లాంటి ముక్కున పట్టుకుని వదిలేసే మాటలు తప్ప వారిదగ్గర అంతకు మించి సరకు ఉండదు.

ఇక సొంతగా డబ్బింగ్ చెప్పుకుని తమ టాలెంట్ ని ప్రూవ్ చేసుకునే ఓపిక ఎలాగూ ఉండదు వీరికి. పరభాషా నటులు చాలా మందికి డబ్బింగ్ కోసం స్పెషల్ గ్రూప్ లు ఉన్నాయి. అయితే అందరినీ ఆశ్చర్య పరుస్తూ తెలుగు లో తనకి తానే డబ్బింగ్ చెప్పుకోవడం కోసం కేరళా సూపర్ స్టార్ మోహన్ లాల్ సిద్దం అయ్యారు. ఆయన తన సినిమా మనమంతా కోసం చంద్రశేఖర్ ఏలేటి దగ్గర సొంతగా తెలుగు నేర్చుకుని మరీ ఈ సినిమాలో తన పాత్రకి తానే డబ్బింగ్ చెప్పుకోబోతున్నారు.

తెలుగు లో వరసగా మనమంతా , జనతా గ్యారేజ్ సినిమాలకి సంతకం పెట్టిన ఈయన కొన్ని నెలల్లోనే తెలుగు భాషపై పట్టు సాధించారు. ‘మనమంతా’ సినిమాకు సొంతంగా డబ్బింగ్ కూడా చెప్పేసుకున్నారు. ఈ ఆనందాన్ని పంచుకుంటూ డబ్బింగ్ చెబుతున్నప్పటి ఫొటోలు కూడా షేర్ చేశాడు మోహన్ లాల్. ఎంతో బిజీ గా ఉండే ఈ సూపర్ స్టార్ భాష మీద చూపిస్తున్న ప్రేమకి ఆశ్చర్యపోక తప్పదేమో. ఆయన్ని చూసి చాలా మంది సిగ్గు తెచ్చుకోవాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -