Thursday, May 2, 2024
- Advertisement -

అభిమానులను ఆశ్చర్యపరచిన మలయాళ సూపర్ హీరో

- Advertisement -

జ‌న‌తాగ్యారేజ్ సినిమాలో మ‌ళ‌యాల సూప‌ర్ స్టార్ మోహ‌న్ లాల్ ఇప్పుడు యంగ్ లుక్‌లో క‌నిపిస్తున్నారు. మొత్తం కంప్లీట్ హ్యాండ్స‌మ్ లుక్‌లో క‌నిపించి సంద‌డి చేస్తున్నారు. అస‌లు ఆయ‌న్ను గుర్తుప‌ట్ట‌లేని విధంగా క‌నిపించి అభిమానుల‌ను, ప్రేక్ష‌కుల‌ను అల‌రించాడు.

కంప్లీట్ యాక్టర్‌గా గుర్తింపు పొందిన మోహన్‌లాల్ నటన గురించి ఎంత చెప్పినా తక్కువే. మలయాళం బాక్స్ ఆఫీస్‌కు తన సినిమాలతో ఎప్పటికప్పుడు కొత్త పాటలను నేర్పే ఈ హీరో నటనకు ఎవ‌రైనా ఫిదా కావాల్సిందే. 57 ఏళ్ల వ‌య‌సులో అయితే మోహన్‌లాల్ పెద్ద వయస్కుడిగా కనిపించినా కూడా ఆయన యాక్షన్ సీన్స్‌ను కూడా చాలా బాగా చేస్తారు. డూప్ లేకుండా తనకు సంబంధించిన సీన్స్‌ని తానే చేసుకుంటారు. ఐదు ప‌దుల వ‌య‌సులో ఉన్న అత‌డు యంగ్ లుక్‌లో క‌నిపిస్తున్నాడు. అయితే అయన చాలా రోజుల తర్వాత సరికొత్త లుక్‌తో అందరికీ షాక్ ఇచ్చారు. ప్రస్తుతం మోహన్‌లాల్ ఒడియాన్ సినిమాలో నటిస్తున్నారు. అయితే ఆ సినిమా కోసం చాలా వెయిట్ తగ్గారు. ఇటీవల విడుద‌ల‌యిన ట్రైలర్ అందరినీ ఆకట్టుకుంది. అయితే అందులో ఉన్నది నిజంగా మోహన్ లాలేనా అని ప్రేక్షకులు ఆశ్చర్యపోయారు. ఇటీవ‌ల ఓ దుకాణ ప్రారంభానికి హాజ‌రైన మోహ‌న్‌లాల్ చూసి అంద‌రూ షాక‌య్యారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -