Tuesday, May 14, 2024
- Advertisement -

తండ్రి సినిమాకి కొడుకు రేటింగ్!

- Advertisement -

నందమూరి బాలకృష్ణ హీరోగా వస్తున్న ‘డిక్టేటర్ ఈ చిత్రం రేపు విడుదల కాబోతుంది. బాలయ్య సరసన అంజలి, సోనాల్ చౌహాన్ హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాకి శ్రీవాస్ దర్శకత్వం వహిస్తున్నారు. అభిమానుల భారీ అంచనాల మధ్యలో ఈ సినిమా రిలీజ్ అవుతుంది. ఐతే ఈ చిత్రాన్ని బాలకృష్ణ అతని కొడుకు మోక్షజ్ఞ మరియు మొత్తం ఫ్యామిలీతో కలిసి ప్రసాద్ ల్యాబ్స్ లో చూశారు.

ఈ సినిమా మోక్షజ్ఞ తెగ నచ్చిందట. ఈ చిత్రానికి 10 కి గాను 8  రేటింగ్ ఇచ్చాడు మోక్షజ్ఞ. ఈ సినిమా అందరికి బాగా నచ్చుతుందని అందరిని ఆకట్టుకునేవిధంగా ఈ సినిమా దర్శకుడు తెరకేక్కించడని అతని సన్నిహితులతో మోక్షజ్ఞ చెబుతున్నాడు.

ఐతే ఇదివరకు లెజెండ్ సినిమాని చూసిన మోక్షజ్ఞ 10 కి గాను 6 రేటింగ్ ను ఇచ్చాడు. అప్పుడు ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. డిక్టేటర్ చిత్రం లెజెండ్‍కు మించి పెద్ద హిట్ అవుతుందని నందమూరి అభిమానులు అనుకుంటున్నారు. సో మరి ఈ సినిమా ఎలా ఉందో తెలియాలి అంటే రేపటిదాకా అగల్సిందే.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -