Wednesday, May 8, 2024
- Advertisement -

డిక్టేటర్ రివ్యూ

- Advertisement -

కోనా వెంకట్ ఒక సినిమాకి పనిచేస్తున్నాడు అంటే ఆ సినిమా కి డైరెక్టర్ కంటే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు నిర్మాతలు. బయ్యర్ లు కూడా ఆయన ఫేస్ , నేమ్ చూసే సినిమాని కొంటారు. అలాంటి కోనా వెంకట్ ప్రస్తుతం ప్లాప్ లతో సతమతం అవుతున్నాడు.

డైరెక్టర్ గా త్వరలో ఎంట్రీ ఇద్దాం అనుకున్న తరుణంలో 2015 ప్లాపులతో వెక్కిరించింది ఆయన్ని. అలాంటి రైటర్ ఇంకొక టాప్ అయిదుగురు రైటర్ లని తోడుగా బాలకృష్ణ కోసం కథ రాస్తే అదే డిక్టేటర్ అవుతుంది. లెజెండ్ తరవాత లయన్ తో ప్లాప్ కొట్టిన బాలకృష్ణ ఈ సారి ఎలాంటి హడావిడి చేసారో చూద్దాం రండి 

 

హైదరాబాద్ లోని ధర్మ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ కి సంబందించిన ఓ సూపర్ మార్కెట్ లో పనిచేస్తూ ఉంటాడు ధర్మ(బాలకృష్ణ). తన పని తానూ చేసుకుపోతూ, గొడవలకి దూరంగా చాలా శాంతంగా ఉండే ధర్మ కాత్యాయని(అంజలి) వాళ్ళ ఇంట్లో ఉంటాడు. ధర్మ – కత్యాయానికి పెళ్లై ఉంటుంది కానీ కాత్యాయని ఉద్యోగరిత్యా వేరే ప్లచె లో ఉంటుంది. దాంతో కాత్యాయని ఇంటి బాధ్యత మొత్తాన్ని ధర్మ చూసుకుంటూ ఉంటాడు. అలా సాగిపోతున్న లైఫ్ లోకి అనుకోకుండా ఇందు(సోనాల్ చౌహాన్) ప్రవేశిస్తుంది. ఇందు వాళ్ళ అన్నయ్య వలన డ్రగ్ డీలర్ అయిన విక్కీ(విక్రమ్ జీత్) గ్యాంగ్ నుంచి ఇందుకి ఓ సమస్య వస్తుంది. తన అన్నయ్య కోసం ఇందూ ని కిడ్నాప్ చేసారు అని తెలుసుకుని ధర్మ కాపాడడం కోసం వస్తాడు. ఈ విషయం తెలుసుకున్న సుమన్ (ధర్మ గ్రూప్ ఎండీ రాజశేకర్ ) ధర్మ ని ఈ విషయం మీద నిలదీస్తుండగా  బాలకృష్ణ నే డిక్టేటర్ అని బయటపడుతుంది. ఈ సమయంలో అసలు డిక్టేటర్ ఎవరూ, కథలో అతి పెద్ద ట్విస్ట్ ఏంటి , ఈ కిడ్నాప్ నిజంగా ఎవరికోసం జరిగింది ఇలాంటి విషయాలు సినిమా చూసి తెలుసుక్కోవాలి. బాలకృష్ణ  యాక్షన్ ఈ సినిమా కి మంచి హై లైట్ అని చెప్పాలి. తన ఆహార్యం, స్టైల్ తో మాస్ కి పిచ్చెక్కించాడు బాలయ్య. చాలా చోట్ల డైలాగులకంటే నటన కి ప్రాధాన్యం ఇస్తూ కనిపించాడు.గణ గణ సాంగ్ లో బాలకృష్ణ చాలా కష్టపడ్డాడు. రెండు డిఫరెంట్ షేడ్స్ తో బాలకృష్ణ నటించడం విశేషం. చాలా కాలం తర్వాత బాలయ్య సూపర్ స్టైలిష్ గా కనిపించడం కూడా సినిమాకి కొత్తదనాన్ని అందించింది.అంజలి తన మేరకు పరవాలేదు అనిపించింది . సోనాల్ చౌహాన్ ని గ్లామర్ కోసం మాత్రమే పెట్టుకున్నారు అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.30 ఇయర్స్  పృధ్వీ ఈ సినిమా లో చాలా వరకూ సేవియర్ గా ఉన్నాడు. శ్రద్ధ దాస్ – ముమైత్ ఖాన్ లతో చేసిన ఐటమ్ సాంగ్ మాస్ ఆడియన్స్ కి స్పెషల్ ట్రీట్ అని చెప్పాలి.హీరోయిజం ఎలివేట్ అయిన ఫస్ట్ హాఫ్ లో ప్రీ ఇంటర్వల్ బ్లాక్, ఇంటర్వెల్ ఎపిసోడ్ లు చాలా బాగా కుదిరాయి. అక్కడ అసలైన డిక్టేటర్ గురించి చెప్పడం మరియు డిక్టేటర్ పాత్రకి రతి అగ్నిహోత్రి, నవాబ్ షా పాత్రలకి మధ్య జరిగే పోటా పోటీ సీన్స్ ఆడియన్స్ లో మంచి ఊపు తెస్తాయి. పవర్ఫుల్ డిక్టేటర్ పాత్ర ఈ సినిమాకి మేజర్ హైలైట్.

 

చాలా నెమ్మదిగా సాగిన ఫస్ట్ హాఫ్ అతి పెద్ద మైనస్ పాయింట్. కామెడీ తో కవర్ కూడా చెయ్యలేక డైరెక్టర్ ఈ సినిమా మొదటి హాఫ్ ని బాగా బోర్ కొట్టించాడు. అసలు కథ విషయం లో సరైన పాయింట్ కూడా లేకా నీరుగారిపోయింది. డిక్టేటర్ అనే పాత్ర కి బిల్డప్ ఇవ్వడం అనే కాన్సెప్ట్ మీద కథ రాసుకున్నారు అంతే. అందుకే కథ సరిగ్గా లేదు అనిపిస్తుంది. కథలో ఎంత సీరియస్ నెస్ ఉంటే ఆసక్తికర స్క్రీన్ ప్లే కి మంచి రెస్పాన్స్ వస్తుంది కానీ కథ బలంగా లేకపోవడం వల్ల ఎంత మంచి పోరాట సన్నివేశం అయినా ఎందుకు అంత కష్టపడుతున్నాడు అనిపిస్తుంది. పోనీ కథనం మరీ కొత్తగా లేదు.కానీ కథనం కూడా చాలా సింపుల్ గా ఉంది.. కథలో ఎలాంటి ట్విస్ట్ లు లేవు.. చాలా ఫ్లాట్ గా వెళ్తుంది. దానికి తోడూ నేరేషన్ కూడా చాలా స్లోగా ఉండడం వలన చాలా చోట్ల బోరింగ్ గా కూడా ఉంటుంది. ఇక సెకండాఫ్ లో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ తర్వాత సినిమా మొత్తం ఊహాజనితంగా మారుతుంది. చాలా వరకూ ఎడిటింగ్ చెయ్యాల్సిన అవసరం ఉంది. రెండు మూడు సీన్ లు మినహా కామెడీ కూడా విపరీతంగా ఏమీ పండలేదు. సినిమా మొత్తం ఎక్కడో సాగుతున్న ఫీలింగ్ కలుగుతుంది. అంతమంది రైటర్ లు ఉన్నా కూడా కథా పరంగా పెద్ద స్ట్రాంగ్ లైన్ తీసుకోకపోవడం మైనస్. బాలయ్యని కొత్తగా చూపుతూ, బాలయ్య బాడీ లాంగ్వేజ్ కి సరిపడా కొన్ని సీన్స్ తో సినిమాని రాసేసారు తప్ప కథకి ప్రాధాన్యత ఉండేలా చూసుకోలేదు. డైరెక్టర్ గా శ్రీవాస్ కూడా  ఒక్క బాలయ్య మీదే ఎక్కువ దృష్టి పెట్టడం వలన అక్కడక్కడా బోరింగ్ ఎలిమెంట్స్ వచ్చాయి. 

 

మొత్తం గా :

నందమూరి అభిమానులతో పాటు సినిమా ప్రేక్షకులకి కూడా ఒక మాస్ మసాలా ఎంటర్టైనర్ గా సాగిన సినిమా డిక్టేటర్. ఈ సినిమా ఫస్ట్ హాఫ్ యావరేజ్ గా ఇంటర్వెల్ బ్లాక్ లో ఎలేవేషన్ బాగుంది. కథ – కథనం ఇంకా స్ట్రాంగ్ గా ఉంటె చాలా బాగుండేది. రొటీన్ క్లిమాక్స్ కూడా విసిగిస్తుంది.  బాలయ్య అభిమానులకి పండగే కానీ జనాలకి ఎలా ఎక్కుతుందో చెప్పలేం. సంక్రాంతి బరిలో ఒక స్ట్రాంగ్ సినిమాని పోటీకి బాలకృష్ణ దించారు అని చెప్పచ్చు కానీ సంక్రాంతి విజేత అని మాత్రం ప్రకటించలేని పరిస్థితి. ఖచ్చితంగా లయన్ లాంటి ఖలఖండాల కంటే బాగుంది కానీ లెజెండ్ కి పోల్చడానికి కూడా సరిపోదు. 

 

 

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -