Monday, May 13, 2024
- Advertisement -

మోక్షజ్ఞకు ఇష్టం లేకపోయినా.. ఓకె చేసిన బాలయ్య

- Advertisement -

నందమూరి కుటుంభం నుంచి మరో మూడో జనరేషన్ వారసుడిగా మోక్షజ్ఞ ఎంట్రీ ఆల్మోస్ట్ కన్ఫామ్ అయిపోయింది. అయితే మనోడు ఎటువంటి పాత్రతో ఎంట్రీ ఇస్తాడనేది సస్పెన్స్. ఈ మ్యాటర్లో బాలయ్య ఫ్యాన్స్ కి ఓ క్లారిటీ దొరికినట్లుంది. బాలయ్య చేస్తానంటున్న ఎన్టీయార్ బయోపిక్ లో … మోక్షజ్ఞతో ప్రత్యే పాత్ర వేయించాలని చూస్తున్నట్లుగా తెలుస్తోంది. అన్నగారి చిన్ననాటి పాత్రను మోక్షజ్ఞతో వేయించాలన్నది బాలయ్యబాబు ఉద్దేశ్యం కావచ్చు.

బట్ ఈ పాత్ర చేయడంలో మోక్షజ్ఞ ఒప్పుకోలేదని అతను కూడా అఖిల్ తరహాలో జోష్ మీదుండే చిత్రమే చేయాలని చూస్తున్నాడట.అందుకు గాను తండ్రి తెచ్చిన ప్రపోజల్ ను యాక్సెప్ట్ చేయనన్నాడని చెబుతున్నారు. అంతే కాకుండా డైరెక్ట్ యాక్టింగ్ లోకి కాకుండా ప్రొడక్షన్ వ్యవహరాలు ,డైరెక్షన్ డిపార్ట్ మెంట్ లో మెళకువలు నేర్చుకోవాలని చూస్తున్నట్లుగా తెలుస్తోంది.

అన్నీ రంగాల మీద గ్రిప్ వచ్చాక అప్పుడు హీరోగా ఎంట్రీ ఇవ్వాలని తపిస్తున్నాడట. ఇంతటి ఆలోచనలో కొడుకు ఉన్నప్పటికీ తాను మాత్రం తన కుమారుడి విషయంలో వెనకడుగు వేయడం లేదని తెలుస్తోంది. ఇదే టైమ్లో ఏకంగా బ్రహ్మతేజ ప్రొడక్షన్స్ పేరుతో సొంత బ్యానర్ రిజిస్టర్ చేసి.. నాన్న బయోపిక్ కోసం ఏర్పాట్లు షురూ చేసుకుంటున్నారని తెలుస్తోంది.

డైరెక్టర్ గా తేజ పేరు కూడా దాదాపుగా ఖరారైనట్లే అంటున్నారు. కామ్ గా రన్ అవుతోన్న స్క్రిప్ట్ వర్క్ కూడా అపుడే క్లయిమాక్స్ లో వరకు వచ్చేసిందట. అన్నీ కుదిరితే మోక్షజ్ఞ ను ఒప్పించి ఎన్టీయార్ బయోపిక్ జనవరిలో సెట్స్ మీదకు తీసుకుపోవాలని చూస్తున్నారట.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -