Saturday, May 4, 2024
- Advertisement -

ఒప్పుకోకుంటే కిడ్నాప్ చేయ‌డానికి య‌త్నం

- Advertisement -

సోనాలి బింద్రేపై పాకిస్తాన్ క్రీడాకారుడి ల‌వ్‌

హీరోయిన్ల‌కు పిచ్చ ఫ్యాన్స్ ఉంటారు. ఒక్కోరు అయితే గుళ్లు, గోపురాలు వాళ్ల కోసం త‌మ జీవితాలు త్యాగం చేసేంత పిచ్చి ప్రేమ‌, అభిమానం ఉంటుంది. ఆ హీరోయిన్ల‌ను పెళ్లి చేసుకోవాల‌న్న ఆశ కూడా ఉంటుంది. ఆ జాబితాలో సినీన‌టులు, ప‌లువురు ప్ర‌ముఖులు కూడా ఉంటారు. ఇప్పుడు అలాంటిదే జ‌రిగింది. ఓ హీరోయిన్‌పై పాకిస్తాన్ మాజీ క్రికెట‌ర్ మ‌న‌సు పారేసుకున్నాడు. చివ‌రికి త‌న ప్రేమ‌ను అంగీక‌రించ‌క‌పోతే కిడ్నాప్ చేయాల‌ని ప్లాన్ వేశాడంట‌.

పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ అందాల తార సోనాలి బింద్రేకు వీరాభిమాని. అభిమాని కాదు పెళ్లి చేసుకునేంత ప్రేమ నింపుకొని ఉన్నాడు. బాలీవుడ్ న‌టి సొనాలి బింద్రె అందానికే అందంలా ఉంటుంది. ఆమె అందాచందాల‌కు అప్ప‌టి త‌రం మురిసిపోయింది.. మ‌తులు పోయాయి. ఆ స‌మ‌యంలోనే షోయ‌బ్ అక్త‌ర్ ఆమెపై మ‌న‌సు ప‌డ్డాడ‌ట‌. త‌న‌ది వ‌న్‌సైడ్ ల‌వ‌ర్ అని.. ఆమెను పిచ్చాపాటిగా ప్రేమించాడంట‌. ఈ విష‌యాన్ని అత‌డే స్వ‌యంగా ప్ర‌క‌టించాడు. ఆమెపై మనసుపడి తన ప్రేమను చెప్పాలని అనుకున్నాడట. అంతే కాకుండా ఆమెను కిడ్నాప్ కూడా చెయ్యాలని అనుకుంటున్నాడట.

మురారి, ఇంద్ర, ఖడ్గం, శంకర్ దాదా ఎంబీబీఎస్ సినిమాల్లో తెలుగు తెర‌పై మరాఠి భామ సోనాలి బింద్రే న‌టించి ప్రేక్ష‌కుల‌ను మెప్పించింది. వన్ సైడ్ లవ్‌తో కొన్నేళ్లపాటు ఓపిక పట్టి చివ‌ర‌కు సోనాలిని కలుసుకోవాలని ఒక రోజు ఆమెకు సంబంధించిన వారి అనుమతి తీసుకున్నాడు. కలిసిన వెంటనే తన ప్రేమను అందంగా చెప్పి ఒకే చేయించాలని అనుకున్నాడు. అయితే తన ప్రేమను ఒప్పుకోక‌పోతే సోనాలిని కిడ్నాప్ చేసేందుకు కూడా ప్లాన్ వేసుకున్నాడట. అయితే చివరికి ఏం జరిగిందో తెలియదు గాని.. చెప్ప‌లేక‌పోయాడంట‌. త‌న‌ ప్రేమ సంగతి ఏమోగానీ కనీసం ఆమెను కలవడం కూడా కుదరలేదని షోయబ్ అక్తర్ బాధ‌ప‌డిపోయాడు.చివ‌రికి నిర్మాత గోల్డీ బెహల్‌ను ప్రేమించి పెళ్లాడింది. సినిమాల‌కు దూర‌మైపోయింది.

https://www.youtube.com/watch?v=BTdGs0dqlg4

 

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -