Monday, May 20, 2024
- Advertisement -

చంద్ర‌బాబు అనుగ్ర‌హం ఎవ‌రికో……?

- Advertisement -

రాష్ట్రంలో ఎవ‌రికి క‌న‌ప‌డ‌ని అభివృద్ధి ఫిరాయింపు ఎమ్మేల్యేల‌కు క‌న‌ప‌డింది. అంతే వెంట‌నే టీడీపీలోకి ఫిరాయించారు. మొద‌ట్లో బాబూనే ఆకాశాన్నెత్తేశారు. ఇప్పుడిప్పుడే వారిలో భ‌యం మొద‌ల‌య్యింది. ఏంచేయాలో తెలియ‌కు ఎక్కువ‌మంది దిక్కుతోచ‌ని స్థితిలో ఉన్నారు. అదంతా ఏంద‌నుకుంటున్నారా..అస‌లువిష‌యానికి వ‌స్తే.

ఇటీవ‌ల చంద్ర‌బాబు ఎమ్మెల్యేల ప‌నితీరుపై ర‌హ‌స్యంగా ఓస‌ర్వే నిర్వ‌హించారు. స‌ర్వేలో ఫిరాయింపు నేత‌ల ప‌నితీరుమాత్రం ఘోరంగా ఉందంట‌. స‌ర్వేనివేదికల ప్రకారం ఫిరాయింపుల్లో కలకలం మొదలైందట. 2019 ఎన్నిక‌ల్లో వారికి టికెట్లు ఇస్తే గెలిచే వారి సంఖ్య చాలా తక్కువని రిపోర్టు వచ్చిందట. అభివృద్ధికోస‌మే టీడీపీలో చేరామ‌ని చెప్పినా ఎక్క‌డా అభ‌వృద్ధిక‌నిపంచ‌డంలేద‌న్న‌ది వాస్త‌వం.

వైసిపి అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డిని దెబ్బ కొట్టటమే ఏకైక లక్ష్యంగా చంద్రబాబు ఫిరాయింపులకు తెరలేపారు. వైసిపి ఎంఎల్ఏలు టిడిపిలోకి దూకేముందు తమ నియోజకవర్గాల్లో అభివృద్ధి పనులు, వ్యక్తిగతంగా తమకున్న అప్పులు, కాంట్రాక్టులు, వచ్చే ఎన్నికల్లో టిక్కెట్లు, ఎన్నికల ఖర్చు తదితరాలపై స్పష్టమైన హామీ పొందిన తర్వాతే ఫిరాయించారు. జ‌గ‌న్‌ను ఇబ్బంది పెట్ట‌డ‌మే బాబు ల‌క్ష్యంకాబ‌ట్టి వారు అడిగిన అన్నింటికీ త‌లూపారు. ఫిరాయింపుల తర్వాత వారందరినీ పక్కన పెట్టేసారు.

దానికితోడు ఎన్నికలు దగ్గర పడే కొద్దీ ఫిరాయింపుల విషయంలో చంద్రబాబు స్వరం మారిపోతోంది. ఫిరాయింపులందరకీ టిక్కెట్లు ఇవ్వలేమంటూ అంతరంగిక సంభాషణల్లో చంద్రబాబు స్పష్టంగ చెబుతున్నారు. కడప జిల్లాలో బద్వేలు ఫిరాయింపు ఎంఎల్ఏ జయరాములకైతే టిక్కెట్టు కష్టమని బహిరంగంగానే చెప్పిన విషయం అందరికీ తెలిసిందే. మిగితా వారి ప‌రిస్థితిఏంట‌నే చ‌ర్చ జ‌రుగుతోంది.

తాజా పరిస్ధితిని బట్టి ఫిరాయింపుల్లో అందరికీ టిక్కెట్లు దక్కవన్నది స్పష్టమవుతోంది. అదే సందర్భంలో నలుగురు ఫిరాయింపు మంత్రుల్లో ఇద్దరు గెలుపు కష్టమనే ప్రచారం బాగా జరుగుతోంది. కారణాలేమైనా కానీ ఆ ఇద్దరి పనితీరుపై అసంతృప్తిగా ఉండటంతో వారికి ముఖ్యమంత్రి అపాయిట్మెంట్ దొరకటమే కష్టంగా ఉన్నట్లు పార్టీ నేతలే చెబుతున్నారు. ఎవ‌రికి బాబు అనుగ్ర‌హం ఉంటుందో లేదో చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -