Wednesday, May 15, 2024
- Advertisement -

జియో రూ. 98 అయితే ఎయిర్‌టెల్ రూ. 93కే

- Advertisement -

టెలికాం రంగంలో సంచలనం సృష్టించిన రిలయన్స్‌ జియో కొత్తకొత్త ఆఫర్లతో వినియోగదారులను ఆకట్టుకుంటున్న విషయం తెలిసిందే. జియోతోపాటు అన్ని టెలికం సంస్థ‌లు ఆఫ‌ర్లు ప్ర‌క‌టిస్తున్నాయి. అయితే జియోకు ప్ర‌ధానంగా ఏయిర్‌టెల్ గ‌ట్టిపోటీ ఇస్తోంది.

ఈ మధ్య జియో రూ. 98తో ప్రీపెయిడ్‌ రీఛార్జ్‌ ఆఫర్‌ను తీసుకొచ్చింది. దీంతో ఇందుకు పోటీగా ప్రముఖ టెలికాం సంస్థ ఎయిర్‌టెల్‌ కూడా వినియోగదారులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. ఇందులో భాగంగానే రూ. 93తో 1జీబీ డేటా అంటూ ప్రీపెయిడ్‌ రీఛార్జ్‌ ఆఫర్‌ను తీసుకొచ్చింది. రూ. 93తో రీఛార్జ్‌ చేసుకుంటే 10 రోజుల వ్యాలిడిటీతో 1జీబీ డేటా అందిస్తుంది. దీంతో పాటు అపరిమిత లోకల్‌, ఎస్టీడీ కాల్స్‌, రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లు ఇస్తుంది. జియో కూడా రూ. 98కి 14 రోజుల వ్యాలిడిటీతో 2.1జీబీ డేటా అందిస్తోంది. అయితే జియోలో రోజుకు 0.15జీబీ డేటా పరిమితి ఉండగా.. ఎయిర్‌టెల్‌లో ఎలాంటి పరిమితులు లేవు.

తక్కువ వ్యాలిడిటీలో డేటా ఆఫర్లు కావాలనుకునే వినియోగదారుల కోసం ఈ ఆఫర్‌ను తీసుకొచ్చినట్లు ఎయిర్‌టెల్‌ తెలిపింది. మరోవైపు టెలికాం సంస్థ వొడాఫోన్‌ కూడా తక్కువ వ్యాలిడిటీతో ప్రీపెయిడ్‌ ఆఫర్‌ తీసుకొచ్చింది. రూ. 46కే ఏడు రోజుల వ్యాలిడిటీటో 500 ఎంబీ 4జీ డేటా అందిస్తోంది.

న్యూఇయ‌ర్ సంద‌ర్భంగా జియోకు గట్టిపోటీని ఇవ్వ‌డానికి ప్రైవేట్ టెలికాం సంస్థ‌లు తీవ్రంగా ప్ర‌య‌త్నిస్తున్నాయి. ఎయిర్‌టెల్‌తో పాటు ఐడియా, వొడాఫోన్‌లు కూడా ఆఫ‌ర్లు ప్ర‌క‌టిస్తున్నాయి. ఏదేమైనా కొత్త‌సంవ‌త్స‌రం పుణ్య‌మాని వినియోగ‌దారుడు లాభ‌ప‌డితే చాల‌ని మార్కెట్ నిపుణులు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -